ఆర్లపాడులో కార్డెన్‌ సెర్చ్‌

May 26,2024 21:02

ప్రజాశక్తి – గంపలగూడెం : ఉన్నతాధికారుల ఆదేశాలే శిరోధార్యం అని తిరువూరు సిఐ షేక్‌ అబ్దుల్‌ నభి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకే మండలంలో ఆర్లపాడు గ్రామాన్ని కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జరగనున్న సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో అసాంఘిక శక్తులను గుర్తించి, అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నట్లు వివరించారు. సమస్యలు తలెత్తకుండా తాము ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు. మొత్తం 50 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టముట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా 20 ద్విచక్ర వాహనాలను వివిధ పత్రాలు లేనివిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ కొండూరు ఎస్సై చల్లా కృష్ణ, గంపలగూడెం ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️