సమ్మె కాలపు హామీల అమలేది..?

Feb 14,2024 13:15 #ntr district
citu protest for strike promises

నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దర్నా 
ప్రజాశక్తి-నందిగామ : మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు హామీలను అమలు చేయాలి లేని పక్షంలో సమ్మెబాట పడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి కటారపు గోపాల్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 16 రోజుల సమ్మె కాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె. గోపాల్ మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల సమ్మె కాలవేతనం, మంత్రులు అధికారుల సమీక్షంలో ఒప్పుకొని ఇప్పుడు పని చేస్తేనే 16 రోజులు సమ్మె కాల వేతనాలు ఇస్తామని అని చెప్పటం సరైనది కాదన్నారు. పనితో సంబంధం లేకుండా 16 రోజులు సమ్మె కాలం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా సమ్మె విరమించిన మూడు రోజుల్లోనే పెంచిన వేతనాలు జీవో ఇస్తామని ఇంతవరకు నెల రోజులైనా జీవోలు విడుదల చేయ లేదన్నారు. తక్షణమే పెంచిన వేతనాలు జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మె విరమించేటప్పుడే ప్రభుత్వానికి చెప్పాము తాత్కాలిక సమ్మె వాయిదా వేస్తున్నామని, మరల సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు ఈ ధర్నా సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్రి వెంకటేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి దాసవరపు సైదా , అద్యక్షుడు సలికేటి నరేష్, పుట్టా మాణిక్యం, బేబీ, నాగరాజు, ప్రసాద్ ,పిచ్చియ్య, రూత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️