కొనసాగిన నామినేషన్లు

Apr 22,2024 22:56
  • జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నామినేషన్‌ దాఖలు

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో ఐదో రోజు సోమవారం జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్‌ అధికారి ఆర్‌ వెంకటేశ్వర్రావు తెలిపారు. వీటిలో స్వతంత్ర అభ్యర్థిగా జొన్నకుటి అహరోను, మేడేపల్లి ఫ్రాన్సిస్‌, వైసిపి అభ్యర్థిగా సామినేని విమల, స్వతంత్ర అభ్యర్థిగా అయిలపోగు వెంకటేశ్వర్లు, జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థిగా కరిసే మధు నామినేషన్‌ వేసినట్లు ఎలక్షన్‌ రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు.కూటమి ఎంఎల్‌ఎ అభ్యర్థి సౌమ్య నామినేషన్‌నందిగామ : బిజెపి, జనసేన బలపర్చిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని టి.డి.పి విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ అన్నారు. నందిగామ పట్టణంలో జరిగిన తంగిరాల సౌమ్య నామినేషన్‌ కార్యక్రమంలో కేశినేని శివ నాథ్‌ ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి పాల్గొన్నారు. నందిగామ టి.డి.పి పట్టణ పార్టీ కార్యాలయం నుంచి వేలాది మంది కార్యకర్తలతో సోమవారం తంగిరాల సౌమ్య నామినేషన్‌ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. చైతన్య రథంపై ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ ఆఫీసు నుంచి సీఎం రోడ్డు మీదగా గీతా మందిరం సెంటర్లో గజమాలతో స్వాగతం పలికారు. నామినేషన్‌ అనంతరం గాంధీ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సౌమ్య గెలుపు సాధిస్తారన్నారు. టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కొలికపూడి నామినేషన్‌ప్రజాశక్తి – తిరువూరు : టిడిపి తిరువూరు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కొలి కపూడి శ్రీనివాసరావు సోమవారం వేసిన నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కోలాహలంగా జరిగిం ది. నాలుగు మండలాల నుండి సమీకరించిన ప్రజల తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ బైపాస్‌ రోడ్డు వినాయకుడి గుడి దగ్గర నుండి మెయిన్‌ రోడ్డు మీదగా అర్‌ డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.2 నామినేషన్లు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరనున్న ఎన్ని కల్లో పోటీ చేసేందుకు సోమవారం రెండు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మాదవి తెలిపారు. టిడిపి అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు, జనవాహిని పార్టీ అభ్యర్థిగా బొల్లిపోగు నాగరాజు నామినేషన్‌ పత్రాలు అందజేసినట్లు చెప్పారు.పశ్చిమలో ఆరు నామినేషన్లుప్రజాశక్తి – భవానీపురం : పశ్చిమ నియోజకవర్గం నుండి ఎంఎల్‌ఎ అభ్యర్థులుగా ఆరుగురు సోమవారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుండి మోహన్‌ డి.ప్రసాద్‌ తాడేపల్లి, వైఎస్‌ఆర్‌సిపి నుండి రేష్మ మహమ్మద్‌, బీఎస్పీ నుండి మద్దిరాల వినోద్‌ కుమార్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా ఇట్టా భవాని, శీరం నాగమల్లేశ్వరరావు, పప్పూరి వెంకట అశోక్‌ భవానీపురంలోని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కిరణ్మయికి తమ నామినేషన్లు వేశారు.మైలవరంలో 5 నామినేషన్లుప్రజాశక్తి – మైలవరం : మైలవరం నియోజకవర్గానికి సంబంధించి సోమవారం ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్ను దాఖలు చేసినట్లు మైలవరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌ సోమవారం తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి బొర్రా కిరణ్‌, అక్కల నాగేంద్రప్రసాద్‌, టిడిపి నుండి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, వసంత శిరీష, స్వతంత్ర అభ్యర్థిగా వేములపల్లి పృథ్వి తమ నామినేషన్లను దాఖలు జేసినట్లు ఆయన తెలిపారు.

➡️