ఇండియా వేదిక, పలు ప్రజా సంఘాలు బలపరచిన సిపిఎం సెంట్రల్‌ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు రేపు నామినేషన్‌

Apr 17,2024 22:19
  • సింగ్‌నగర్‌ నుంచి ప్రదర్శన్య
  • ధర్నా చౌక్‌లో సభ
  • హాజరుకానున్న ఇండియా వేదిక

నేతలుప్రజాశక్తి – విజయవాడ : కాంగ్రెస్‌, సిపిఐ, ఆప్‌, లిబరేషన్‌, ఆర్‌జెడి, ఇండియా వేదికలోని పార్టీలు, కార్మిక, సామాజిక, ప్రజా సంఘాలు బలపరిచిన సిపిఎం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు 19వ తేదీ ఉదయం నామినేషన్‌ దాఖలు చేస్తారని ఆ పార్టీ ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ఉదయం 10 గంటలకు అజిత్‌సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు సెంటరు నుండి భారీ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన గాంధీనగర్‌ అలంకార్‌ సెంటరులోని ధర్నా చౌక్‌ వరకూ సాగుతుందని తెలిపారు. అనంరతం సభ జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, మాజీమంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా నాయకులు నరహరి శెట్టి నరసింహారావు, మాజీ అధ్యక్షులు వి.గురునాథం, ఆప్‌ జిల్లా నాయకులు పరమేశ్వరరావు, లిబరేషన్‌ నాయకులు డి.హరినాథ్‌, ఆర్‌జెడి నాయకులు, అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు, ఇండియా వేదికలోని ఇతర పార్టీల రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. ప్రదర్శన, సభల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, శ్రేయోభిలాషులు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని డివి.కృష్ణ కోరారు.

➡️