గొంత్తెండిపోతుంది… మంచినీరు అందించండి…

Jan 29,2024 11:48 #ntr district
cpm protest for water problem

 ప్రజాఆరోగ్యంతో చెలగాటం తగదు 

ఇంటి ఇంటికీ కుళాయి కనెక్షన్లు ఎన్నికల వాగ్దానం ఏమైంది 
కొండపల్లి మున్సిపాలిటీలో 10 లక్షల సామర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లు నిర్మించాలి

 సిపియం టౌన్ కార్యదర్శి యం మహేష్

ప్రజాశక్తి-కొండపల్లి : ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో గాంధీ బొమ్మ వద్ద మంచినీటి సమస్య పరిష్కారం కోరుతూ సిపియం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 29 వార్డులో ప్రజలు మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం చాలా బాధాకరమని తక్షణమే మున్సిపల్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిపియం కొండపల్లి టౌన్ కార్యదర్శి యం మహేష్ డిమాండ్ చేశారు. విటిపియస్ బూడిద వాటర్, మంచినీటి పంపు హౌస్ లో కలవటం తో కలుషితం అవుతున్నాయని ప్రజలు మంచినీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ పైప్ లైన్లు రిపేర్ చేయాలని, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ లు కొండపల్లి, ఇబ్రహీంపట్నం లో నిర్మించాలని డిమాండ్ చేశారు. మంచినీరు ఫిల్టర్ చేసి కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాలని, సురక్షిత మంచినీటి ని ప్రజలకు అందించి ప్రజా ఆరోగ్యం కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపియం కొండపల్లి టౌన్ కమిటీ సభ్యులు ఎ విఠల్ రావు, ఇ కొండలరావు, రామసీతా, బేబీ సరోజినీ, పార్వతీ, నవీన స్థానిక నాయకులు రమణమ్మ, కృష్ణారాయులు, ప్రభుదాస్,గౌరీ, దుర్గా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

➡️