బిఎఎస్‌ఎఫ్‌ రూపొందించిన

May 22,2024 21:33

ఎఫికాన్‌ ఆవిష్కరణ

విజయవాడ : స్థానిక విజయవాడ హోటల్‌ ప్రైడ్‌ మాధవ్‌లో వ్యవసాయ ఉత్పత్తులలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జర్మనీకి చెందిన ప్రముఖ పురుగుమందుల కంపెనీ బిఎఎస్‌ఎఫ్‌ రూపొందించబడిన ‘ఎఫికాన్‌’ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జింగ్‌ క్వింగ్‌ బి-వైస్‌ ప్రెసిడెంట్‌ మార్కెటింగ్‌ ఆసియా ఫసిఫిక్‌, గిరిధర్‌ రానువా బిజినెస్‌ డైరెక్టర్‌ బిఎఎస్‌ఎఫ్‌ ఇండియా లిమిటెడ్‌ శశి కిరణ్‌ లింగం-రీజనల్‌ పోర్టుఫోలియో మేనేజర్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌, ఆసియా ఫసిఫిక్‌, ప్రశాంత్‌ జోషి-హెడ్‌ మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌ నీలేష్‌ రావూల్‌, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ రమేష్‌ బాబు, బిజినెస్‌ యూనిట్‌ లీడ్‌ భార్గవ్‌ రెడ్డి, మార్కెటింగ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ నూతి, రాకేష్‌ కుమార్‌, బిజినెస్‌ క్లస్టర్‌ లీడ్స్‌ రమేష్‌, రీజనల్‌ మేనేజర్‌ నన్‌ హేమ్స్‌, మనోజ్‌ కుమార్‌ నూనె, వినరు ప్రభాత్‌ గ్యారంపెల్లి-టెరిటరీ మేనేజర్స్‌, సాయి దుర్గ ఆగ్రో ఏజెన్సీస్‌-డిస్ట్రిబ్యూటర్‌ మాలంపాటి రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బిజినెస్‌ డైరెక్టర్‌-గిరిధర్‌ రానువా మాట్లాడుతూ అందరి ఆదరాభిమానాలతో వ్యాపారం ఎంతో అభివృద్ధి గడించిందని చెప్పడం గర్వకారణంగా ఉందన్నారు. మార్కెటింగ్‌ మేనేజర్‌-భార్గవ్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత నూతన కీటకనాశణి శ్రేణులో ఎఫికాన్‌ ఒక అద్భుతమైన కీటకనాశణి అని తెలిపారు. ప్రపంచ సస్య రక్షణ పరిశోధనలో ఎఫికాన్‌ ఒక నూతన శకాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. బిజినెస్‌ యూనిట్‌ లీడ్‌-రమేష్‌ బాబు మాట్లాడుతూ మా కంపెనీ ప్రతి సంవత్సరం రీసెర్స్‌, డెవలప్మెంట్‌ కొరకు రూ. 8వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. హెడ్‌ మార్కెట్‌ మేనేజ్మెంట్‌-ప్రశాంత్‌ జోషి మాట్లాడుతూ మా సంస్థ ఈ రోజు విడుదల చేసిన ‘ఎఫికాన్‌’ కీటక నాశిని ప్రత్తి, మిరప, వంగ, టమాటో, కీరదోస పంటలను ఆశించు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక సమస్యల నుంచి పంటను దీర్ఘకాలం రక్షిస్తూ అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతుంది. ఎఫికాన్‌ పురుగు మందు ఐఆర్‌ఎసి 36 అనే ప్రత్యేక గ్రూపునకు సంబంధించిన మందు, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఉత్పాదనలన్నింటి కంటే భిన్నమైన చర్యతో కీటకాల నుండి పంటను దీర్ఘకాలం సమర్ధవంతంగా రక్షిస్తుంది. ఈ కార్యక్రమంలో డీలర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️