వలసవాదులకు అధికారం ఇవ్వొద్దు

May 2,2024 22:02
  • పశ్చిమ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : ఎన్నికల సమయంలో వలస వచ్చి ప్రజలు ఓట్లు అడిగే వారికి అధికారం కట్టబెట్టొద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు అన్నారు. గురువారం 48వ డివిజన్‌ చిట్టినగర్‌ సొరంగం, 45వ డివిజన్‌ కబేళా ప్రాంతాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడి శాసన సభకు నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎన్నికల సమయంలో తప్ప తరువాత ప్రజలకు కనిపించే అవకాశాలు తక్కువ అన్నారు. రూ.5,700 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారో ఆలోచన చేయాలన్నారు. తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో పశ్చిమ నియోజకవర్గ ప్రాంతం అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ఇండియా వేదిక తరుపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ‘కంకి కొడవలి’ గుర్తుపై, విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్‌కు ‘హస్తం’ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, కార్యవర్గ సభ్యులు బుద్దే రాజా, 48వ డివిజన్‌ కార్యదర్శి డీవీ రమణబాబు, 45వ డివిజన్‌ కార్యదర్శి ఉప్పలపాటి శివప్రసాదరాజు పాల్గొన్నారు.ఉపాధి కూలీలకు అండగా ప్రభుత్వం : సామినేనిప్రజాశక్తి – వత్సవాయి : ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను అన్నారు. వత్సవాయి మండలంలోని తాళ్లూరు గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా చిల్లకల్లు రోడ్డు పెద్ద కాలువ వద్ద పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు ప్రభుత్వవిప్‌ శాసనసభ్యులు సామినేని ఉదయభాను వెళ్లారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాళ్లూరు, మాచినేనిపాలెం గ్రామాల నందు ప్రభుత్వవిప్‌ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంద్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాదని హామీలను గుప్పిస్తున్నారని అన్నారు. జగన్‌ నా ఎస్‌సి, నా ఎస్‌టి, నా బిసి, నా మైనార్టీ అంటూ వారిని అక్కున చేర్చుకున్నారన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను అ అభ్యర్థించారు.

➡️