గడపగడపకూ తిరుగుతూ ప్రచారాలు

Apr 20,2024 22:18

ప్రజాశక్తి – అవనిగడ్డ : అవనిగడ్డ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌కు అఖిలభారత చిరంజీవి యువత మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు రవణం స్వామి నాయుడు తెలిపారు. శనివారం అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి బుద్ధ ప్రసాద్‌ ఇంటికి వచ్చిన స్వామి నాయుడు బుద్ధ ప్రసాద్‌ అభినందించి జనసేన పార్టీ గాంధీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల ఉద్దేశించి స్వామి నాయుడు మాట్లాడుతూ మెగాస్టార్‌ చిరంజీవి అత్యంత ఇష్టపడే వ్యక్తులలో మండలి బుద్ధ ప్రసాద్‌ ఒకరని అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్డీఏ కోటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ ని గెలిపించాలని కోరారు. బుద్ధ ప్రసాద్‌తో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని అవనిగడ్డ నియోజకవర్గంలో ఏదైనా అభివద్ధి జరిగింది అంటే బుద్ధ ప్రసాద్‌ హయాంలోనే జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు గాజు గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా మండల బుద్ధ ప్రసాదును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ తనకు మద్దతుగా అఖిల భారత చిరంజీవి యువత బృందాన్ని పంపినందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు సుగుణ బాబు ఎల్‌ శ్యాంబాబు రవీంద్రబాబు అనిల్‌ విష్ణు కొరియర్‌ శ్రీను బాదర్లలో లాక్షనాయుడు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మతి వెంకటేశ్వరరావు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయిపూడి వేణుగోపాలరావు, లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ బాసు నాంచారయ్య నాయుడు పాల్గొన్నారుకప్పలదొడ్డిలో శంఖారావంప్రజాశక్తి – గూడూరు : గూడూరు మండలం కప్పలదొడ్డిలో శంఖారావం సూపర్‌ సిక్స్‌ పథకాలను పెడన నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్‌ సతీమణి కాగిత శిరీష శనివారం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి కాగిత కష్ణ ప్రసాద్‌ కి, పార్లమెంట్‌ అభ్యర్థి బాలసౌరి కి గాజు గుర్తుపై పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.పులిగడ్డలో టిడిపి జనసేన ప్రచారంప్రజాశక్తి – అవనిగడ్డ : అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండలి బుద్ధ ప్రసాద్‌ను మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని కోరుతూ మండల పరిధిలోని పులిగడ్డ గ్రామంలో కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. బాలశౌరి బుద్ధ ప్రసాద్‌ ల ఎన్నికల గుర్తు గాజు గ్లాస్‌ అని గాజు గ్లాస్‌ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బుద్ధ ప్రసాద్‌ సతీమణి మండలి విజయలక్ష్మి జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారుటిడిపితోనే గ్రామాభివృద్ధి : రాజేశ్వరరావుప్రజాశక్తి – హనుమాన్‌ జంక్షన్‌ : టిడిపితోనే గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమని మండల అధ్యక్షులు దయ్యాల రాజేశ్వరరావు అన్నారు. టిడిపి టౌన్‌ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రమైన బాపులపాడులోని కె.ఎస్‌.టాకీస్‌ ప్రాంతంలో గడపగడపకు ప్రజాగళం పేరుతో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాజేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివద్ధి జాడ లేకుండాపోయిందని, సహజ వనరుల దోపిడీ యధేచ్ఛగా సాగిందని ఆరోపించారు. కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు సైకిల్‌ గుర్తుపై, బందరు పార్లమెంట్‌ అభ్యర్థి బాల శౌరికి గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.దళితుల అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉంది: కొల్లు ప్రజాశక్తి – మచిలీపట్నం రూరల్‌ : దళితుల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి చంద్రబాబునాయుడు అని కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మచిలీపట్నం మండలం పెదయాదర, చినయాదర దళిత వాడలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, ఎంపి అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి జనసేన ఇంచార్జి బండి రామకష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి చంద్రబాబు అన్నారు. తెదేపా హాయంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో వాడ వాడలా సి.సి.రోడ్ల నిర్మాణం చేశామన్నారు. వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ దళిత లను నమ్మించి నట్టేటా ముంచిన వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి.ఇళ్ల స్థలాల పేరుతో ఎస్సీ లకు చెందిన 11,000 ఎకరాల ను స్వాధీనం చేసుకున్నారని, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన నిధులను దారి మళ్లించారు. బండి రామకష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం మీ లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలి.జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత నిధులతో దళితుల కోసం చేయగలిగామన్నారు.రైతుల సంక్షేమం కోసం వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం : కిట్టుప్రజాశక్తి – మచిలీపట్నం రూరల్‌ : రైతుల సంక్షేమం కోసమే వైసిపి ఎంతో పాటుపడుతోందని, గత పాలకులు కేవలం వారి ప్రయోజనాల కోసం ఆలోచించి, రైతులు మహిళలు, నిరుపేదల సమస్యలను గాలికి వదిలేసి, పాలన సాగించారని వైసిపి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) పేర్కొన్నారు. శనివారం ఆయన మచిలీపట్నం మండలంలోని ఎస్‌.ఎన్‌.గొల్లపాలెం గ్రామంలో గడప గడపకు మన సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతన్నల కోసం చేసిన అభివృద్ధి ఏమిటనేది, మీరే ఆలోచించాలని ఆయన అన్నారు. ఇదే సందర్భంలో ఆహార ధాన్యాలు కొనుగోలు విషయంలో కూడా జగనన్న ప్రభుత్వం రైతులకు అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇంచార్జి మట్టా మోహన నంచారయ్య, తదితరులు పాల్గొన్నారు. సింహాద్రి తనయుడి ప్రచారంప్రజాశక్తి – కోడూరు : కోడూరులోని 1వ వార్డులో అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు తనయుడు యువ నాయకుడు వికాస్‌ శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు గురించి ప్రజలకు వివరిస్తూ తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుపై వేసి మచిలీపట్నం పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావుని, అవనిగడ్డ నియోజకవర్గం వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి సింహాద్రి రమేష్‌ బాబుని, అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.అవకాశం ఇవ్వండి …అభివద్ధి చేస్తాప్రజాశక్తి – పెడన : ఒక్కసారికి అవకాశం ఇస్తే అభివద్ధి చేసి చూపిస్తామంటూ వైసిపి శాసనసభ అభ్యర్థి ఉప్పాల రాము ప్రజలను విజ్ఞప్తి చేశారు. పట్నంలోని 22, 23 వార్డుల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఉప్పాల హారికతో కలసి శనివారం పర్యటించారు. గడపగడప సందర్శిస్తూ ప్రభుత్వ నుంచి వచ్చిన సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంతోపాటు రూరల్‌ ప్రాంతాల్లోని అవసరమైన తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు.వైసిపి అభ్యర్థి కైలే ప్రచారంప్రజాశక్తి పెదపారుపూడి : వైసిపి పామర్రు ఎంఎల్‌ఎ అభ్యర్థిగా తనను, మచిలీపట్నం ఎంపి అభ్యర్థిగా సింVహాద్రి చంద్రశేఖర్‌ను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కైలే అనిల్‌ కుమార్‌ కోరారు. శనివారం ఈ మేరకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ లంచాలకు తావు లేకుండా.. గంటల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాలంటరీ వ్యవస్థను జగన్‌ కల్పించారన్నారు. పెత్తందార్ల పక్షాన నిలిచే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రెండు వ్యవస్థలను రద్దు చేస్తారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా ఎప్పుడూ అండగా ఉండే తాను భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.నమ్మకం ఉంటే ఓటు వేయండి : వంశీ ప్రజాశక్తి – గన్నవరం : గన్నవరం పట్టణంలో అభివద్ధి చేయడంతో పాటు అడిగిన వారికి లేదనకుండా సహాయం చేశానని మీకు నమ్మకం ఉంటే మరోసారి ఓటు వేసి గెలిపించాలని వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్‌ అన్నారు. శనివారం గన్నవరం పట్టణంలోని మదర్‌ థెరిసా కాలనీలో, బుద్ధవరం రోడ్డు, గౌడ పేట, జగదీశ్వరరావు కాలనీలో విస్తత ప్రచార కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ప్రచార రథం పై నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గ అభివద్ధిలో తన పాత్ర కీలకమైందన్నారు. కోట్లాది రూపాయలు పేదలకు సహాయంగా అందించినట్లు గుర్తు చేశారు.

➡️