నిర్లక్ష్యానికి గురైన విజయవాడలో మారుద్దాం

Mar 16,2024 13:02 #ntr district

సింగ్ నగర్లో రెండో బ్రిడ్జి కట్టాలంటే సిపిఎం గెలిపిద్దాం

సింగ్ నగర్ ట్రాఫిక్ ను రూపుమాపాలి అంటే సిపిఎంకు మద్దతు తెలపండి
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : విజయవాడ సెంట్రల్ సిటీ సింగ్ నగర్ పాదయాత్ర ఇంటింటికి కరపత్రాల ప్రచారం భాగంగా భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ సింగ్ నగర్ లో ట్రాఫిక్కు సమస్య విపరీతంగా ఉందని సింగ్ నగర్ అభివృద్ధి చెందాలంటే రెండవ ఫ్లైఓవర్ నిర్మించాలంటే సిపిఎంకు మద్దతు తెలపండి చెత్త పనులు రద్దు చేయాలంటే సిపిఎంను గెలిపించండి ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం అవ్వాలి అంటే కమ్యూనిస్టులకు మద్దతు తెలపండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించండి కార్మిక సమస్యలు పరిష్కరించాలంటే సిపిఎం బలపరచండి పాయకాపురం రాజీవ్ నగర్ శాంతినగర్లో మంచినీటి సమస్య తీరాలంటే సిపిఎంకు మద్దతు తెలపండి నగర అభివృద్ధి కోరుకుందాం ప్రజా సమస్యల కోసం పోరాడే ఏకైక పార్టీ సిపిఎం కరెంట్ బిల్లులు తగ్గించాలంటే కమ్యూనిస్టులను బలపరచండి. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే సిపిఎంకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసినారు దేశాన్ని రాష్ట్రాన్ని ముంచిన బిజెపి టిడిపి జనసేన పార్టీలను ఓడించండి సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కరించాలంటే విజయవాడ సెంట్రల్ నియోజవర్గం నుండి సిపిఎం అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తే ఈ ప్రాంత సమాసాల పరిష్కారం అవుతాయని దానికోసం ప్రతి ఒక్కరు సిపిఎంకు మద్దతు తెలపాలని కోరారు. నగరంలో అరాచక పాలన పోవాలన్నా మందు గంజాయి బ్లేడు బ్యాచులను అరికట్టాలంటే డిస్నీలాండ్లో ఇంటి స్థలాలు కావాలన్నా వాటికి పట్టాలు కావాలన్నా పోరాడే యోధుడు సిపిఎం నాయకులని వారికి మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు. నీతి నిజాయితీగా పనిచేసే నాయకులు కావాలంటే సిపిఎం అభ్యర్థిని అసెంబ్లీకి పంపించాలి అంటే కమ్యూనిస్టులకు ఓటు వేయాలని ప్రజా సమస్యలను ప్రశ్నించే అభ్యర్థి కావాలంటే సిపిఎం అభ్యర్థిని అసెంబ్లీకి పంపించాలి పార్టీలు మారకుండా ప్రజల కోసం నిలబడే ఏకైక పార్టీ సిపిఎం అని దానికి మద్దతు తెలిపాలని కార్మికుల సమస్యల కోసం పోరాడే సిపిఎం పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణ రావు అధ్యక్షులు కే దుర్గారావు సిపిఎం రాష్ట్ర నాయకులు కే శ్రీదేవి, సిపిఎం నాయకులు ఎస్ కే పీరు, రాంబాబు నాగేశ్వరరావు నజీముద్దీన్, చింతల శ్రీనివాస్, ఏం బాబురావు, కమల రత్నకుమారి, దేవి, విజయ, సాంబిరెడ్డి, సెంట్రల్ సిటీ డివిజన్ ఇన్చార్జిలో కార్యదర్శిలు, అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️