దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి

Jun 17,2024 21:50

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్ర కీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి కుటుంబ సభ్యులతో కలసి సోమవారం ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ ఇఒ కె.ఎస్‌.రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు.దుర్గమ్మ అలంకరణకు బంగరు నత్తు కనుకగా అందజేత…శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అలంకరణ నిమిత్తం విజయవాడకు చెందిన పి.రాజ్‌ కుమార్‌, కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారికి 27 గ్రాములు బరువు గల బంగారు నత్తును కానుకగా ఆలయ అధికారులను సోమవారం కలిసి దేవస్థానానికి అందజేశారు. ఆలయ అధికారులు దాత కుటుంబానికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.

➡️