రోడ్డు ప్రమాదంలో తల్లీ, కొడుకు మృతి

Apr 22,2024 22:51

ప్రజాశక్తి – పెనుగంచిప్రోలు : బైక్‌ను బస్సు ఢకొీట్టడంతో తల్లి, కొడుకు మృతి చెందిన విషాద ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… చందర్లపాడు మండలం కోనయపాలెంకు చెందిన వనపర్తి సురేష్‌ (44) తన భార్య అంజమ్మ, కుమార్తె లాస్య, తల్లి ఆది లక్ష్మి (73)లను తన బైక్‌పై వత్సవాయి మండలం మంగొల్లు గ్రామం వెళ్తున్నాడు. సురేష్‌ మామ మృతిచెందడంతో చూడటానికి వెళ్తుండగా నవాబ్‌ పేట గ్రామ శివాలయం వద్దకు వెళ్ళేసరికి గ్రామంలో నుండి గ్రామ మెయిన్‌ రోడ్డు ఎక్కుతున్న విశ్వవాణి స్కూల్‌ బస్‌ సురేష్‌ బైక్‌ను ఢ కొట్టింది. డ్రైవర్‌ అజాగ్రత్తగా, హారన్‌ కొట్టకుండా, నిర్లక్ష్యం గా బస్‌ నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢ కొట్టగా ప్రమాద స్థలంలోనే సురేష్‌ తల్లి ఆది లక్ష్మి మతి చెందింది. గాయాలపాలైన సురేష్‌ ,అతని భార్య, కుమార్తెలను వైద్యం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సురేష్‌ మృతిచెందాడు. ఐదేళ్ల లాస్య, భార్య అంజమ్మ విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. మృతుడు సురేష్‌ అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.

➡️