భవానీపురంలో రామ్‌రాజ్‌ కాటన్‌ షోరూం ప్రారంభం

May 5,2024 21:44

ప్రజాశక్తి – భవానీపురం : స్థానిక భవానీపురంలోని స్వాతి రోడ్‌లో రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీ నూతన షోరూమ్‌ను ఆదివారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికార్‌ి కె.ఎస్‌.రామారావు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలకు పేరేన్నిక గన్న రామ్‌ రాజ్‌ కాటన్‌ ఎంతో విశిష్టమైందని కొనియాడారు. తాను కూడా గతంలో శ్రీశైలం దేవస్థానం ఈవోగా పనిచేసిన నాటి నుంచి నేటి వరకు దేవస్థానం విధుల్లో ఎల్లప్పుడూ రామరాజ్‌ కాటన్‌ దుస్తులనే ధరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు మాట్లాడుతూ రామ్‌రాజ్‌ కాటన్‌ దుస్తులు ఎంతో హుందాగా ఉంటాయని అన్నారు. దేశంలోని దుస్తుల మార్కెట్లో రామ్‌రాజ్‌ కాటన్‌ ఒక మంచి బ్రాండ్‌గా నిలిచిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల శ్రీనివాస్‌ కుమార్‌ మాట్లాడుతూ భవానీపురం ప్రాంతంలో రామ్‌ రాజ్‌ కాటన్‌ షోరూమ్‌ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. రామ్‌ రాజ్‌ కాటన్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ కె.ఆర్‌. నాగరాజన్‌ ఆహుతులకు స్వాగతం పలికారు. మొదటి సేల్‌ను పాపులర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చుక్కపల్లి విజరు కుమార్‌ కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

➡️