నేటి నుండి కెబిఎన్‌ కాలేజీలో పోస్టల్‌ బ్యాలెట్‌

May 3,2024 21:56

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : ఈ నెల 13న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సంబంధిత విధుల్లో ఉండేవారు, ఇతరుల సౌకర్యార్థం 4వ తేదీ నుండి 6వ తేదీ వరకూ కొత్తపేటలోని కెబిఎన్‌ కాలేజీలో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించినట్లు వెస్ట్‌ అసెంబ్లీ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కిరణ్మయి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, యన్‌.టి.ఆర్‌. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం రిటర్నింగ్‌ ఆఫీసర్‌, 79-విజయవాడ వెస్ట్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో 4వ తేదీ నుండి 6 వరకు పిఓ, ఏపిఓ, ఓపిఓఎంఓ, పోలీస్‌, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, డ్రైవర్స్‌, సెక్టార్‌ ఆఫీసర్స్‌, ఇతరులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించు నిమిత్తం విజయవాడ కొత్తపేటలోని కేబిఎన్‌ కాలేజీ నందు ఫెపిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, ఎలెక్షన్‌ డ్యూటీలో ఉన్న అందరూ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియో గించు కోవాలని వెస్ట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కిరణ్మయి తెలిపారు.

➡️