ఎంఈఓ చొరవతో పాఠశాల ఆవరణ పునరుద్ధరణ

Jul 3,2024 09:44 #ntr district

ప్రజాశక్తి-గంపలగూడెం: వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల ఆవరణ విద్యార్థులు రాకపోకలకు హవాంతరంగా మారడంతో పునరుద్ధరణ పనులు చేపడితే మంచిదని స్థానిక మండల విద్యాశాఖ అధికారి పివిడిఎల్ నరసింహారావు సూచించారు. టౌన్ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ కాలనీ ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ఆవరణ గుంతలలో నీరు నుండి బురద మయంగా మారింది. ఒక సందర్భంలో ఈ పరిస్థితిని చూసిన పివిడిఎల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్నంశెట్టి మోహన్ రావు తో మాట్లాడారు. మోహన్ రావు స్వయానా తన సొంత నిధులతో పది ట్రక్కులు మట్టిని తెప్పించి డోజర్ తో విస్తరింపజేశారు. అంతేకాదు ఉత్తరభాగాన వరద నీరు బయటకు పంపించేందుకు కచ్చా డ్రైవ్ ఏర్పాటు చేయడంతో పాఠశాల ఆవరణ విద్యార్థుల రాకపోకలకు అవకాశం కలిగింది. ఈ మరమ్మత్తుల పనుల విషయంలో అధికార పార్టీ నాయకులు నాయకులు రేగళ్ల వీరారెడ్డి సహకరించినట్లు హెచ్ఎం చిన్నంశెట్టి మోహన్ రావు తెలిపారు.

➡️