విజయవాడ నగరంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

Apr 21,2024 21:47

నగరంలో సమ్మర్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఎగ్జిబిషన్‌ను ఎగ్జిబిషన్‌ సొసైటీ మాజీ కార్యదర్శి మలినేని నారాయణ ప్రసాద్‌, నంది అవార్డ్స్‌ జ్యురీ మెంబర్‌, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి, నటుడు నందివాడ నాని లాంచనంగా ప్రారంభించారు. బందరు రోడ్డు లోని వజ్ర గ్రౌండ్స్‌ లో నూతనంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సెట్టింగులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ ప్రారంభించి మాట్లాడుతూ వేసవిలో పిల్లలకు ఆటవిడుపు కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో జైంట్‌ విల్‌, మేరి కొలంబస్‌, బ్రేక్‌ డాన్స్‌, డ్రాగన్‌ ట్రైన్‌, ఇండియన్‌ టొరాటోరా, ఇటాలియన్‌ ఐటమ్స్‌ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు. బెడ్‌ షీట్స్‌, బెంగాలీ కాటన్‌, శారీస్‌, లక్నో సారీస్‌, నైటీస్‌, కాస్మోటిక్‌, గాజులు అనేకమైన ఆటబొమ్మలు, హ్యాండ్లూమ్స్‌, హ్యాండ్‌ క్రాఫ్ట్‌ స్టాల్స్‌, అనేక రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు గోపీనాథ్‌ మాట్లాడుతూ విజయవాడ నగరానికి తలమాణికంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సమ్మర్‌ స్పెషల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని కోటను ఎగ్జిబిషన్‌ ప్రధాన ద్వారాన్ని అందంగా ముస్తాబు చేసినట్లు చెప్పారు. చిత్రంలోని ప్రధాన ఘట్టాలను ఇతి వృతంగా తీసుకొని ఏర్పాటు చేసిన నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆయన తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వజ్ర గ్రౌండ్స్‌ అధినేత వల్లూరి రవితేజ, మాజీ ప్రిన్సిపాల్‌ దొంతాల ప్రకాష్‌, నిర్వాహకులు నందివాడ కిరణ్‌ అడపా ప్రభాకర్‌,తదితరులు పాల్గొన్నారు.

➡️