నందిగామలో సైన్సు డే

Feb 28,2024 15:50 #ntr district
science day in nandigama

ప్రజాశక్తి-నందిగామ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రవీంద్ర భారతి స్కూల్ నందు జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా( విజ్ఞానశాస్త్ర ప్రదర్శన) సైన్స్ ఎక్స్పో స్కూల్ విద్యార్థులు బుధవారం నిర్వహించారు. సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి కందుల వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు వారు తయారుచేసిన విజ్ఞానశాస్త్ర నివేదిక, ప్రదర్శన బోర్డు, నమూనాల రూపంలో ప్రదర్శించారు. ప్రిన్సిపల్ రాము మాట్లాడుతూ ఈ ప్రదర్శన విద్యార్థులు సంవత్సరమంతా చదువుకున్నది, ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక వేదిక అన్నారు. విద్యార్థులలో ప్రేరణ కల్పిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని తెలుసుకునే విధంగా ఉంటుందన్నారు. విద్యార్థులు తాము చేసిన పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల విద్యార్థులలో అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ , డైరెక్టర్ వీరమాచినేని శాంతి విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. సైన్స్ ఎక్స్పో అందర్నీ ఆకర్షింపజేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. ఈ విజ్ఞానశాస్త్ర ప్రదర్శన లో వివిధ స్కూల్లో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️