సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలి

May 21,2024 20:28

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : విద్యార్థులు సామాజిక బాధ్యతలను పెంపొందించుకొని సమాజానికి అండగా ఉండాలని కాకరపర్తి భావనారాయణ కళాశా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీ. నారాయణరావు అన్నారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో నగరానికి శివారు ప్రాంతంలో ఉన్న కార్నర్‌ స్టోన్‌ ఓల్డేజ్‌ హాోమ్‌కు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోల ఆధ్వర్యంలో విద్యార్థులు వృద్ధాశ్రమానికి వెళ్లి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలోని పరిస్థితులను అవగాహన చేసుకోవాలన్నారు. సమాజంలోని అట్టడుగువర్గాలకు అండగా ఉండే విధంగా విద్యార్థులు తమ భవితను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. తోటి మానవులకు సేవచేసిన వారు భగవంతుడికి సేవ చేసినట్లేనని సూచించారు. విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒలు డి.వపన్‌కుమార్‌, ఎన్‌.సాంబశివరావు, జెడ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️