శారద విద్యా సంస్థల విజయకేతనం

Apr 12,2024 22:49

 ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్శిటీ : ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో మొగల్‌రాజపురంలోని శారద విద్యా సంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారని శారద విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వై.రమేష్‌భాబు తెలిపారు. మొగల్‌రాజపురంలోని కళాశాల కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్‌ ఎంపిసి విద్యార్థులు యస్‌. యామిని 470 మార్కులకుగాను 466 మార్కులు, కె.జాన్‌ మార్లిటో 465 మార్కులు, డి.మాధురి 465 మార్కులు, జి.రసజ్ఞ 465, ఎ.నాగసాయి 464, జి.తేజస్విని 464, పి.సాయి వర్ణ 464, వై.హర్ఫ నందన వెంకట సంతోష్‌ 463 మార్కులు, కె.రోహిత్‌ 464 మార్కులు సాధించారన్నారు. జూనియర్‌ బైపిసి విభాగంలో యస్‌.జాహ్నవి 440 మార్కులకుగాను 435 మార్కులు, బి.సింధు 433, సి.హెచ్‌.శ్రీరామ్‌ 430, కె.యషిత 430, బి.అనన్య 429, సి.హెచ్‌.బ్రాహ్మణి 428 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపిసి విద్యార్థులు సిహెచ్‌.శ్రీరామ్‌ సంజీవ్‌ -1000 మార్కులకుగాను 987, టి.నాగభారతి 987, కె.నవ్య చంద్రిక 987, సి.హెచ్‌.శ్రావణి 987, మనస్వి దుర్గా 986, టి.లక్ష్మీ తేజస్విని 984, మార్కులు సాధించారన్నారు. సీనియర్‌ ఇంటర్‌ బైపిసి విభాగంలో ఎ.మధు మేఘన 1000 మార్కులకు గానూ 989, ఎం.లావణ్య 987, ఆర్‌.సిందుశ్రీ 982, బి.తేజస్వి మోహన 980, యం.చిన్మయి 980 మార్కులు సాధించారని తెలిపారు. శారద విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.శారదాదేవి మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులను సొంత విద్యార్థులలుగా మంచి శిక్షణ అందించామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను శారద విద్యాసంస్థల జనరల్‌ మేనేజర్‌ జి.వి.రావు, అభినందించారు.

➡️