టిడిపి, వైసిపిలు నోట్లతో రాజకీయం చేశాయి

May 20,2024 20:18
  • రాజేశ్వరీపేటలో పర్యటన సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు

సెంట్రల్‌ సిటీ సింగ్‌నగర్‌ రాజ రాజేశ్వరి పేటలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు సిపిఎం నేతలతో కలిసి రాజరాజేశ్వరి పేటలో ఇంటింటికి తిరిగి తమకు మద్దతు తెలిపినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ టిడిపి, వైసిపి నాయకులు నోట్ల రాజకీయాలు చేశారు. నీతిమాలిన కబుర్లు చెబుతూ ప్రజలకు విచ్చలవిడిగా డబ్బులు పంచారు. ఎన్నికల అనంతరం అధికార ప్రతిపక్ష నాయకులు విదేశాల్లో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎంజారు చేస్తున్నారని ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని రాష్ట్రంలో హింస చెలరేగిపోతుందని ఎన్నికల అనంతరం బ్లేడు బ్యాచ్‌ చెలరేగిపోతున్నారని ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నాయకులు ఎన్నికల కోడ్‌ ఉందని చెప్పడం దారుణని అమన్నారు. అత్యవసర పనులకు ఎన్నికల కోడ్‌ సంబంధం ఏంటని ప్రశ్నించారు. కరెంట్‌ బిల్లు ఇంటి బిల్లు చెత్త పన్ను కట్టించుకోవడానికి ఎన్నికల కోడ్‌ అడ్డం రాదా అని ప్రశ్నించారు. ఎన్నికలు అవగానే చెత్త పన్ను వసూలు చేయాలని అధికారులు మున్సిపల్‌ కార్మికులపై వత్తిడి చేస్తున్నారని వాటిని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తడి పొడి చెత్త తరలించే వాహనదారులు డ్రైవర్లు గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా నాయకులు అధికారులు పట్టించుకోవటం లేదని వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు గాని ఎలక్షన్‌లో పంచడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. సిపిఎంకు ఎన్నికల్లో మద్దతు తెలిపిన కుటుంబాలకు అభినందనలు తెలియ జేస్తున్నామని, ఎన్నికల అనంతరం కూడా నిత్యం ప్రజల సమస్యలపై ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణరావు, సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు కె.దుర్గారావు సిపిఎం నాయకులు ఎస్‌కె.పేరు, చింతల శ్రీనివాస్‌, ఆర్‌ఆర్‌పేట డివిజన్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️