ఊరంతా జల్లెడ పట్టిన పోలీసులు

May 27,2024 11:38 #ntr district

ప్రజాశక్తి-గంపలగూడెం : జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు పోలీసులు చేపడుతున్నారు. అందులో భాగంగా తిరువూరు సిఐ షేక్ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో తిరువూరు, ఏ కొండూరు, గంపలగూడెం, ఎస్ఐలతో పాటు 60 మంది కానిస్టేబుల్ ఒక్కసారిగా, సొబ్బాల గ్రామాన్ని సందర్శించి, గార్డెన్ (వలయాకారంలోచుట్టముట్టి) చర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు పరిశీలించి సరైన పత్రాలు లేని వివిధ రకాల వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో సమస్యలు వస్తే తమకు తెలపాలని ప్రజలకు వివరించారు. ఏ సమస్య వచ్చినా తామన్నామని భరోసా కల్పించారు. ఊరంతా జల్లెడ పట్టి ప్రజలందరికీ సదరు విషయాన్ని తెలిపారు. ఎస్సైలు సత్యనారాయణ, చల్లా కృష్ణ, ఎస్ శ్రీనివాస్ లున్నారు.

➡️