భోగి మంటల్లో ప్రభుత్వ వైఖరి దహనం

Jan 14,2024 12:56 #ntr district
utf protest on GO

ప్రజాశక్తి-రెడ్డిగూడెం : భోగి మంటల్లో ప్రభుత్వ వైఖరి దహనం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు యుటిఎఫ్ రెడ్డిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం వద్ద ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగ, ఉపాధ్యాయులను శత్రువులుగా చూస్తున్నారు. తమకు రావలసిన బకాయిలను సైతం ప్రభుత్వం వాడుకుని… బకాయిలు అడిగినందుకు తిరిగి ఉద్యోగ ఉపాధ్యాయులపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. పైగా మేము ఉద్యోగుల పక్షపాతం అని మోసపూరిత మాటలు చెబుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు ఉదయం భోగి మంటల్లో ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక న్యూస్ పేపర్ క్లిప్స్ ను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమ లో యు.టి.ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శులు పి.భవాని, సూర్యనారాయణ, యూ.టీఎఫ్. ఏలూరు జిల్లా కార్యదర్శి  పి.వీరకోటి రెడ్డిగూడెం మండలం అధ్యక్షులు టి.బాలభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పి.సుబ్రమణ్యం, కోశాధికారి కె.రవిబాబు, ఉపాధ్యక్షులు కె.విజయకుమార్, కార్యదర్శులు ఎం.చంద్రు పాల్గొన్నారు.

➡️