అభ్యర్థుల ప్రచారాల జోరు

May 10,2024 22:04

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా కోటేశ్వరరావు విజయంతోనే బిసి వర్గాలకు మేలు జరుగుతుందని ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్ధవరపు వెంకట్రావ్‌ అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి గుమ్మడిదల కోటేశ్వరరావుకు బీసీ సంఘాల ఐక్య వేదిక మద్దతు ప్రకటిస్తుందన్నారు. గతంలో విద్యార్థి నాయకుడుగా, కార్మిక సంఘ నాయకుడి పనిచేసిన కోటేశ్వరరావు విజయవాడ నగరంలో కార్పొరేటర్‌గా ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. ప్రజా సమస్యలపై నిబద్ధతో పనిచేసే ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించటం ద్వారా వెనుకబడిన వర్గాల గొంతుకను చట్టసభల్లో ప్రస్తావించి ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తారని చెప్పారు. బ్యాలెట్‌ పేపర్‌లో సీరియల్‌ నంబరు 5 వద్ద ‘కంకి – కొడవలి’ గుర్తుపై ఓటు వేసి కోటేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. యాదవ సంఘం నగర కార్యదర్శి బొమ్మిడి వాసుదేవరావు యాదవ్‌ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై స్పందించే స్థానికుడైన జి.కోటేశ్వరరావుకు ఓటు వేస్తే మన గల్లీకి తాను స్వయంగా విచ్చేసి సమస్యలపై స్పందిస్తారని, ఢిల్లీలో కూర్చునే నాయకులకు కాదు మనకు కావాల్సింది అన్నారు, విజయవాడ నగర శాలివాహన సంఘం అధ్యక్షులు భర్తవరపు దుర్గాప్రసాద్‌, నాయకులు చిత్రాతిపల్లి వెంకటేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ సంఘం నగర మాజీ కార్యదర్శి మోకా దుర్గారావు (చిన్న), దళిత హక్కుల సంఘం నాయకులు వై.జోసుఫ్‌, ఏపీ రజక వత్తిదార్ల సంఘం ఎన్టీఆర్‌ జిల్లా నాయులు రాచాకుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.63వ డివిజన్లో సిపిఎం నాయకులు ప్రచారంప్రజాశక్తి – అజిత్‌సింగ్‌ నగర్‌ : సెంట్రల్‌ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె.శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావును గెలిపించాలని పిలిస్తే పలికే నాయకులు కావాలని ప్రజల అవసరాలకు స్పందిం చే నాయకులు అవసరమని విజయవాడ అభివృద్ధి చెందా లంటే సిహెచ్‌.బాబురావును భారీ మెజార్టీతో గెలిపిం చాలని టిడిపి జనసేన వైసిపి బిజెపిని ఓడిం చాలని కోరా రు. బి.రాంబాబు, అమ్ములు, పి.సాంబి రెడ్డి, సూరిబాబు, సిఐటియు నాయకులు దయా, రమాదేవి పాల్గొన్నారు.ఉదయభాను గెలుపు కోరుతూ ప్రచారంజగ్గయ్యపేట : వైసిపి జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను గెలుపు కోరుతూ వారి కుమార్తె పద్మ ప్రియాంక, వారి కోడలు కావ్య, మేనల్లుడు ప్రతిక్‌ (బిన్ను), ఇంటురి శ్రీలత మండలంలోని కాకతీయ సిమెంట్‌ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ, ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను చేసిన అభివద్ధిని తెలియపరుస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి మరొకసారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.శ్రీరాం తాతయ్య సతీమణి అమ్మాజీ ప్రచారంజగ్గయ్యపేట : ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 19వ వార్డు, 18వ వార్డు చెరువు బజార్‌, మార్కండేయ బజార్‌లో టీడీపీ, జనసేన, బిజెపిల మహిళలు, నాయకులతో కలిసి శ్రీరాం తాతయ్య సతీమణి శ్రీరాం శ్రీదేవి, శ్రీరాం శ్రీవల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటింటికి వెళ్లి తన భర్త శ్రీరాం తాతయ్య గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు గుర్తు చేసి, టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు గురించి వివరించారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి రాజగోపాల్‌ తాతయ్యను, ఎంపీగా కేశినేని శివనాద్‌ చిన్నిని మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు.కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వజ్రయ్య ప్రచారంప్రజాశక్తి – నందిగామ : నందిగామ మండలం తక్కెళ్లపాడు, లింగాలపాడు, చందపురం కేతివీరునిపాడు, ఐతవరం, అంబారుపేట గ్రామాలలో శుక్రవారం నందిగామ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మందా వజ్రయ్య ప్రచారం నిర్వహించారు. నందిగామ అసెంబ్లీ నియోజవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందా వజ్రయ్య, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కనకపూడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి వేల్పుల శివకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అభిమానులు సీనియర్‌ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.వైసిపితో అభివృద్ధికి శ్రీకారం : నల్లగట్ల స్వామిదాస్‌ప్రజాశక్తి – తిరువూరు : రెండోసారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్‌ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను అయన శుక్రవారం తిరువూరులోని ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తిరువూరు పట్టణం చుట్టూ ఔటర్‌రింగ్‌ రోడ్‌ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. స్మార్ట్‌ సిటీగా తిరువూరును అభివృద్ధి చేయటం, తిరుపూరు పట్టణంలో రూ.100 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేస్తానని చెప్పారు. తిరువూరు నియోజక వర్గంలో స్కిల్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి నిరుద్యోగయువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని ఇండిస్టియల్‌ హబ్‌గా మార్చడంతో పాటు మెగా ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేయటమే కాకుండా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు.కొండపల్లి లో సిపిఎం, కాంగ్రెస్స్‌ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారంప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : కొండపల్లి మునిసిపాలిటీ లో ఆర్‌ సి ఎం కాలనీ, రిక్షా కాలనీలలో ఎమ్మెల్యే అభ్యర్థి బొర్రా కిరణ్‌, సిపిఎం నాయకులు, కాంగ్రెస్స్‌ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్స్‌ పార్టీకి అవకాశం ఇవ్వండి, పార్టీ ఇచ్చిన అన్ని హామీలు అమలు పరుస్తుందని, స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న థర్మల్‌ నుంచి వస్తున్న బూడిదను నివారిస్తామని, ఇంటింటికీ నీటి కుళాయి ఏర్పాటు చేస్తామని, కొండపల్లి మునిసిపాలిటీని మోడల్‌ మునిసిపాలిటీగా అభివృద్ధి చేస్తామని బొర్రా కిరణ్‌ అన్నారు. ఈ ప్రచారంలో అక్కల ప్రసాద్‌, కాండ్రకొండ అప్పారావు, రాగాల రాము, కొప్పుల చిన్నప్ప, చెరుకు ఆనందరావు, పోతురాజు, బాడిశ వెంకటేశ్వరరావు థామస్‌ పాల్‌ వున్నారు.కంచికచర్లలో వైసిపి అభ్యర్థి జగన్మోహన్‌రావు రోడ్‌ షోప్రజాశక్తి – కంచికచర్ల : నందిగామ వైసిపి అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగింపు దశకు రావటంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ రోడ్‌షో నిర్వహించారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ సెంటర్‌ నుండి రోడ్‌షో ప్రారంభించారు. అభ్యర్థి జగన్మోహన్‌ రావు, సర్పంచ్‌ వేల్పుల సునీత, ఎంపిటిసి వేమా రోజా రమణి, సొసైటీ అధ్యక్షుడు కాలవ పెదబాబు తదితరుల ఎక్కారు. రోడ్‌ షో పొడవునా అభ్యర్థి జగన్మోహన్‌రావు ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్ల అభ్యర్ధించారు. రోడ్‌ షో వాహనానికి ముందు పెద్దఎత్తున మహిళలు నడిచారు. యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్‌ బంక్‌ సెంటర్‌ నుండి ప్రారంభమైన రోడ్‌ షో ర్యాలీ చెవిటికల్లు రోడ్‌ సెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌, నెహ్రూ సెంటర్‌, పెద్దబజారు, అరుంధతీ కాలనీ, అంబేద్కర్‌ కాలనీ మీదగా సాగింది. రోడ్‌ షో సందర్భంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు వేమా సురేష్‌ బాబు, నంబూరు పెదబాబు, అమర్లపూడి యోహాన్‌ పాల్గొన్నారు.జగన్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంజగ్గయ్యపేట : సంక్షేమ పాలన కొనసాగాలంటే మరొకసారి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిని ఆశీర్వదించాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వవిప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను గెలుపు కోరుతూ యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్‌ బాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మన సామినేని ఉదయభాను కంటికి కనిపించే అభివద్ధిని చేసి చూపించారన్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా సామినేని ఉదయభానుని గెలిపించాలని కోరారు.

➡️