ముగిసిన పోలింగ్‌ప్రముఖుల ఓటింగ్‌

May 13,2024 22:47

ప్రజాశక్తి – మైలవరం : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు కు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 7 గంటలకు మైలవరంలో పోలింగ్‌ ప్రారంభమైంది. ఎన్డీఏ కూటమి టిడిపి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ కుటుంబ సమేతంగా నందిగామ నియోజకవర్గం, ఐతవరంలో ఓటు వేశారు. మైలవరం వైసిపి అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, జమిందార్‌ ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్‌ ఎస్‌.వి.సుధాకరరావు తారకరామానగర్‌లోని మండల పరిషత్‌ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌ బాబు కుంటముక్కలలో, మైలవరంలోని జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అప్పిడి కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్యూలో నిలబడి తన ఓటును వేశారు.ఓటు హక్కు వినియోగించుకున్న సామినేని ఉదయభాను, నెట్టం శ్రీ రఘురాం, శ్రీరామ్‌ రాజగోపాల్‌ప్రజాశక్తి – జగ్గయ్యపేట : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జగ్గయ్యపేట పట్టణం మిట్టగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన 64వ బూత్‌లో వైసిపి జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను, ఆయన సతీమణి సామినేని విమలభాను ఓట్లు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ పట్టణంతోపాటు నియోజక వర్గ ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియో గించుకోవాలన్నారు. 34వ బూత్‌లో టిడిపి జగ్గయ్యపేట అభ్యర్థి శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. జగ్గయ్యపేట 51 బూత్‌లో ఎన్టీఆర్‌ జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురామ్‌ ఓటు హక్కు వినియోగించు కున్నారు.ఓటు హక్కును వినియోగించుకున్న పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ దంపతులుజగ్గయ్యపేట: పట్టణంలోని స్థానిక 39వ పోలింగ్‌ బూత్‌లో పట్టణ ప్రథమ పౌరులు మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్‌ బూత్‌లు పరిశీలించిన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పిహెచ్‌డి రామకృష్ణజగ్గయ్యపేట: జగ్గయ్యపేట పట్టణం, మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామాల్లోని పోలింగ్‌ బూత్‌లను సోమవారం సాయంత్రం విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పీహెచ్డీ రామకష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసు కున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని తెలిపారు.పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్‌ నరేంద్ర సింగ్‌ బాలిసాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ నరేంద్ర సింగ్‌ బాలి, తహశీల్దార్‌ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రమైన బలుసుపాడు గ్రామంలోని ఎంపియుపి పాఠశాల పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా పోలింగ్‌ సిబ్బందికి తగు సలహాలు, సూచనలు చేశారు.ఇరు పార్టీ వర్గాల మధ్య గొడవనందిగామ ఏసీపి డాక్టర్‌ రవికిరణ్‌ పోలీస్‌ సిబ్బంది జోక్యం పట్టణం చెరువు బజార్లోని పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 33 బీసీ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఇరుపార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. దీనితో పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఘర్షణలు జరగకుండా నందిగామ ఎసిపి డాక్టర్‌ రవి కిరణ్‌, పోలీస్‌ బృందం మరలా ఘర్షణలు జరగకుండా 33 పోలింగ్‌ బూత్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలుమండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామంలో మండల పరిషత్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన 15వ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన ఓటింగ్‌ 9 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ జరగలేదు. దీంతో టెక్నీషియన్లు వచ్చి ఈవీఎంలను సరి చేయటంతో 9 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. పట్టణంలోని 35వ పోలింగ్‌ బూత్‌ మిట్టగూడెంలో ఈవీఎం మొరాయించటంతో పోలింగ్‌ ప్రక్రియ కొద్ది సేపు నిలిచిపోయింది. ప్రారంభ సమయానికి పోలింగ్‌ ప్రక్రియ జరగకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు. కమల థియేటర్‌ ఎంపిపియస్‌ స్కూలు సీతారామపురం 37, 38 పోలింగ్‌ బూత్‌లలో ఈవియంలు మొరాయించడంతో ఓటర్లు విజయవాడ మెయిన్‌ రోడ్డుకు బారులు తీరారు. పట్టణంలోని దుర్గాపురం ఎంపిపిఎస్‌ స్కూలు 53 పోలింగ్‌ బూత్‌లలో ఈవియంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి ఎండకి బారులు తీరారు. గౌరవరంలో పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి ఎన్నికల సరళిని మండల పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు, ఇతర నాయకులతో కలిసి ఎన్టీఆర్‌ జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురామ్‌ పర్యవేక్షించారు. అనంతరం పోలింగ్‌ బూత్‌ అవతల విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేశినేని శివనాథ్‌ చిన్నికి బ్యాలెట్‌ నమూనాలో వ.నెం 1 సైకిల్‌ గుర్తుపై జగ్గయ్యపేట అసెంబ్లీకి పోటీ చేస్తున్న శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్యకి బ్యాలెట్‌ నమూనాలో వ.నెం 4 సైకిల్‌ గుర్తుపై వేయాలని డమ్మీ బ్యాలెట్‌తో ఓటర్లకు అవగాహన కల్పించారు. తక్కలపాడులో మండల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ బూత్‌ 2లో వీల్‌ చైర్‌లో వచ్చి వద్ధుడు భైరబోయిన వెంకటేశ్వర్లు ఓటు హక్కు వినియోగించుకున్నాడు.మండలంలో జుజ్జూరు పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అబ్జర్వేర్‌ నరేందర్‌ సింగ్‌ బాలి పోలింగ్‌ పరిశీలనప్రజాశక్తి – వీరులపాడు : మండలంలో జుజ్జూరు మండల కేంద్రంలో పోలింగ్‌ బూత్‌ నెంబరు 152, 153, 154 గల పోలింగ్‌ బూత్‌లు పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందితో పోలింగ్‌ జరిగిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మైలవరం నందిగామ జగ్గయ్యపేట అసెంబ్లీ వర్గాల ఎన్నికల వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు గత రెండు నెలల నుండి అధికారులు, సిబ్బంది చక్కటి పాత్ర నిర్వహించి విజయవంతంగా నిర్వహించి వారు పోలింగ్‌ సిబ్బందితో పాటు మీడియా పాత్ర ఎన్నికలు విజయవంతం కావటానికి తోడ్పాటు పడ్డాయి అన్నారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్‌ తోపాటు పోలింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.ప్రజలంతా కూడా మార్పును కోరుకుంటున్నారుమైలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కష్ణ ప్రసాదుప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : మైలవరంలో జరుగుతున్న కొండపల్లి బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎన్నికల ప్రచార సరళిని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లా డుతూ ప్రజా స్పందన చాలా బాగుందని ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఓటింగ్‌ సరళి బాగా పెరుగుతుందని ప్రకృతి కూడా ఇందుకు సహకరించడం శుభ పరిణామమని తెలిపారు.ప్రజాశక్తి – తిరువూరు : తిరువూరు నియోజకవర్గంలో ఓటర్లు పోలింగ్‌ ప్రారంభమైన ఉదయం 7 గంటల నుండి పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా తిరువూరు పట్టణంలో కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో ఉండి ఓటు వేసి బయటకు వచ్చిన వారు అమ్మయ్యా… యుద్ధంలో విజయం సాధించినట్లుగా ఉందని తోటీ ఓటర్ల ముందు వాపోయారు. కొన్ని కేంద్రాల్లో వివిఎంలు నత్తనడకన సాగు తుండటంతో పోలింగ్‌ మందకొడిగా సాగింది. మండలంలోని కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో పోలింగ్‌ కేంద్రం వద్ద సైకిల్‌ ఓటు వేయమని టిడిపి వాళ్లు ప్రచారం చేస్తున్నారనీ వైసిపి నాయకులు గొడవచేయటంతో పోలీసులు వారిని అక్కడ నుండి పంపారు. నియోజకవర్గంలో రాత్రి గంటలకు 81.21 శాతం ఓట్లు పోలైనట్లు రిటర్నింగ్‌ అధికారిణి మాధవి తెలిపారు.వీరులపాడు : ఉదయం ఆరు గంటల నుండి ఓటర్లు పోలిం గ్‌ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున బారులు తీరారు. ముఖ్యం గా మహిళ పోలింగ్‌ కేంద్రాలు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాల దగ్గర గంటలు తరబడి వెయిట్‌ చేసి తమ ఓటు ను వినియోగించుకున్నారు. అన్నవరం చౌటుపల్లి జమ్మ వరం పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈఎంలు సక్రమంగా పని చేయకపోవడం వల్ల జరగాల్సిన టైం కంటే గంట సమ యం ఆలస్యంగా పోలింగ్‌ యంత్రాలు పనిచేసే మం డలంలో స్వల్ప సంఘటన తప్ప ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు ప్రజలకు అసౌకర్యం కలకుండా ప్రజలతో ఎన్నికల సిబ్బందితోపాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని అన్నారుప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ప్రజాశక్తి – రెడ్డిగూడెం : అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.13 కెసియల్‌ 3 కంచికచర్ల లో ఒక పోలింగ్‌ కేంద్రంలో రాత్రి 9 గంటలకు కూడా ఓటు వేసేందుకు క్యూ లైన్‌ లో ఉన్న జనం..ప్రజాశక్తి – కంచికచర్ల : కంచికచర్ల గ్రామంలో సత్రం బడిలో ఏర్పాటు చేసిన 204 పోలింగ్‌ బూత్‌లో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కూడా పోలింగ్‌ కొనసాగుతూనే ఉంది. కంచికచర్ల ఎంపియుపి స్కూల్‌ మొత్తం నాలుగు బూత్‌లలో పోలింగ్‌ కొనసాగింది. 24 బూత్‌ మినహా మిగిలిన అన్నిబూత్‌లలో నిబంధనల మేరకు 6 గంటలకే ఓటింగ్‌ పూర్తయింది. కానీ 204 బూత్‌లో మాత్రం రాత్రి తొమ్మిది గంటల సమయానికి ఇంకా 140 మంది ఓట్లు వేయవలసి ఉంది. మరో గంట వరకు ఓటింగ్‌ కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చినప్పటికీ ఇంకా ఓటింగ్‌ పూర్తి కాలేదంటూ ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆరు గంటలకు పోలింగ్‌ కేంద్రంలో ఉన్న వారిని ఉంచి బయట గేట్లు మూసివేశారు. పోలింగ్‌ కేంద్రంలో ఉన్నవారికి మాత్రం సీరియల్‌ నెంబర్‌ ప్రకారం స్లిప్పులు పంపిణీ చేశారు. స్లిప్‌ నెంబర్ల ప్రకారం పిలిచి ఓట్లు వేయిస్తున్నారు. స్త్రీలు పురుషులు ఇంకా ఓట్లు వేసేందుకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. పోలింగ్‌ నెమ్మదిగా కొనసాగటమే ఆలస్యానికి కారణంగా అధికారులు చెప్తున్నారు. విద్యుత్‌ దీపాల వెలుగులో పోలింగ్‌ కొనసాగింది.

➡️