15 రోజులుగా మంచినీటి కొరత

Jan 24,2024 13:12 #Vijayawada
water problem in vja

వాటర్ ట్యాంక్ దగ్గర ప్రజా సంఘ నాయకులతో ధర్నా
అధికారులను నిలదీసిన స్థానిక ప్రజలు
మద్దతు తెలిపిన సిపిఎం, సిఐటియు నాయకులు
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : విజయవాడలోని రాజీవ్ నగర్ 63వ డివిజన్ లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. గత 15 రోజులుగా మంచినీటి సమస్య తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు మండిపడ్డారు.  అధికారులకు సమస్యపై చెప్పినా గాని స్పందించడం లేదని వాటర్ ట్యాంకులు కూడా రాకపోవడం దారుణమని అన్నారు. కనీసం హ్యాండ్ పంప్ సెట్ లో ఉన్నా గాని కొంతమేరకు సమస్య తీరుతుందని అది కూడా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రజలు తెలియజేస్తున్నారు. దీనిపై స్పందించిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ 15 రోజులుగా నీటి సమస్య ఉన్నప్పటికీ స్థానిక కార్పొరేటర్లు, శాసనసభ్యులు స్పందించపోవడం దారుణమన్నారు. ప్రజలకు కనీస అవసరమైన మంచినీటి సమస్యను కూడా తీర్చకపోతే ప్రజలు ఎలా బతుకుతారని వైసిపి ప్రభుత్వం ఓట్ల కోసమే కానీ ప్రజల సమస్యలు తీర్చడానికి సమయం లేదని ఎమ్మెల్యేలను మార్చడమేనా లేక ప్రజా సమస్యలను పట్టించుకున్నది ఏమైనా ఉందా అని నిలదీశారు.  రాజీవ్ నగరంలో పేదలకు నీళ్లు లేక పిల్లలను స్కూలుకు పంపించాలన్న, రోజు వారికి పనికి వెళ్లాలన్న వీళ్ళు పడటం లేదన్నారు. మంచినీటి కోసం ఎదురుచూస్తున్న గాని 15 రోజుల నుండి నీళ్లు రావడంలేదని, పనులు మానుకొని మంచినీటి కోసం ఎదురుచూస్తున్నామని స్థానిక ప్రజలు సిపిఎం, సిఐటియు నాయకులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఏఈ అజయ్ కుమార్ మంచినీళ్ళ పీ రిఫికేషన్ జరుగుతుందని, దాని వలన కొంత సమయం పడుతుందని తెలియజేయడంతో ప్రజలు ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినారు. దీనిపై స్పందించిన అధికారులు రేపటి నుండి మంచినీళ్లు వస్తాయని చెప్పడంతో వాటర్ ట్యాంక్ దగ్గర నిర్వహించిన ధర్నా విరమించారు. దీనిలో భాగంగా పౌర సంఘాల రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బి రమణరావు, సెంట్రల్ సిటీ అధ్యక్షులు కే దుర్గారావు, సిఐటియు నాయకులు బి రాంబాబు, సాంబిరెడ్డి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

➡️