కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించిన పరిశీలకులు

Apr 25,2024 21:53

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ :  స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను, కౌంటింగ్‌ కేంద్రాలను సాధారణ, శాంతి భద్రతల పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహర్‌, నయీం ముస్తఫా మన్సూరీలు గురువారం పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌, మీడియా సెంటర్‌, సోషల్‌ మీడియా విభాగం, వ్యయ విభాగం, పిర్యాదులు విభాగం, చెక్‌ పోస్టుల పర్యవేక్షణ నియంత్రణ విభాగం, జియో టాగింగ్‌ వాహనాల పర్యవేక్షణ విభాగం తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యాన కళాశాల లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ జిల్లాలో చేపట్టిన చర్యలను, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పనితీరును వివరించారు. కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు, తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో జెసి ఎస్‌ ఎస్‌ శోబిక, డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, పలువురు నోడల్‌ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు ఆర్‌ వి రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌ మెహర్డను ఎన్నికల సంఘం నియమించింది. గురువారం జిల్లాకు చేరుకున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంను తనిఖీ చేశారు. పోలీస్‌ అతిథిగృహం సూట్‌ నెంబర్‌-1 లో బస చేస్తున్నారు. పరిశీలకుల ఫోన్‌ నంబరు 7569898830 కాగా, పరిశీలకుల సమన్వయ అధికారిగా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఎం డి నాయక్‌ (9494427718) వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంబంధిత అంశాలపై సమాచారం, పిర్యాదులు సమర్పించవచ్చని ఆయన తెలిపారు.అంతకుముందు పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహర్‌, నయీం ముస్తఫా మన్సూరీలను జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ గురువారం స్థానిక పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహణకు అమలు చేస్తున్న ప్రణాళిక, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు, పటిష్ట నిఘా, తదితర అంశాలపై కలెక్టర్‌, ఎస్పీ వివరించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఖచ్చితమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుతో పాటు పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అనుసరించాల్సిన విధానంపై చర్చించారు.

➡️