విద్యార్థుల ‘ఓటరు చైతన్య యాత్ర’

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేట పట్టణంలో అన్నపూర్ణ హై స్కూల్‌ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య యాత్ర సోమవారం చేపట్టారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుండి కలువపువ్వు సెంటర్‌ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ప్రలోభాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా ‘ ఓటుకు డబ్బులు వద్దు – మంచి రాజకీయ నాయకుడు ముద్దు ‘ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.

➡️