పాలకొల్లు చాంబర్స్‌ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది బిబిఏ కోర్సు ప్రారంభం

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఛాంబర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో ఈ ఏడాది నుంచి న్యూఢిల్లీలోని ఏఐసీటిఈ గుర్తింపుతో బీబీఏ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు ఛాంబర్‌ కళాశాల అధ్యక్షులు కారుమూరి నరసింహారావు చెప్పారు. కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఛాంబర్‌ కళాశాలలో విద్యనభ్యసించిన పాలకొల్లు పరిసర ప్రాంత సామాన్య విద్యార్థులు 850 మందికి పైగా క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఇంజనీరింగ్‌ కళాశాలలలో కూడా పోటీగా ఉన్న బిబిఏ కోర్సును అన్ని వర్గాల విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు ఈ ఏడాది పాలకొల్లులో మొదటిసారి ప్రారంభిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ కలిదిండి రామరాజు తెలిపారు. మంచి ఫ్యాకల్టీతో ఇప్పటికే ఇంటర్‌, డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందుతున్న ఘనత చాంబర్‌ కళాశాలకు దక్కిందని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరరావు ప్రకటించారు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజు తో ఉన్నత విద్య చెప్పి వారు స్వయంగా ఉపాధి, ఉద్యోగాలు పొందాలనే ధ్యేయంగా కళాశాల యాజమాన్యం పనిచేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్‌ నందుల సీతారామయ్య పాల్గొన్నారు.

➡️