పట్టణ ప్రజలు,యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి

కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌, సిబ్బంది

ప్రజాశక్తి-పల్నాడు :  జిల్లా వచ్చే సాధారణ ఎన్నికల్లో యువత, పట్టణ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ ఓటు హక్కు విని యోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ విజ్ఞప్తి చేశారు. యువఓటర్లు, పట్టణ ప్రజలు ఓటు హక్కు విని యోగించుకోవాల్సిన ఆవశ్యకతపై అవ గాహన కల్పించే నిమిత్తం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో శనివారం స్వీప్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం ట్రైనీ కలె క్టర్‌ కల్పశ్రీ , స్వీప్‌ నోడల్‌ అధికారి నాగిని, ఐసిడిఎస్‌ పిడి ఉమారాణి పాల్గొన్నారు.మహిళా శిశు సంక్షేమ శాఖ సమ న్వయంతో రంగవల్లి ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి శాతం తక్కువగా ఉంటోందని, యువత కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు. మన దేశంలో యువత అధికంగా వున్నారని, ముఖ్యంగా కొత్తగా ఓటరుగా నమోదైన యువత ఓటు విలువ తెలుసుకొని, దానిని విని యోగించుకోవ డం ద్వారా దేశ ప్రజా స్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావా లన్నారు. ప్రపం చంలోనే అతి పెద్ద ప్రజా స్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ఒక పెద్ద పండుగ వంటి దన్నారు.అందరి భాగస్వామ్యంతోనే ప్రజా స్వామ్యం పరిపుష్టమవుతుందన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన సిబ్బందితో ప్రమాణం చేయించారు.

➡️