పే స్కేల్‌ కోసం వీఆర్‌ఏలు ఐక్యంగా పోరాడాలి

సమావేశంలో గద్దెచలమయ్య, షేక్‌ బందగి సాహెబ్‌,గుంటూరు మల్లేశ్వరి

సత్తెనపల్లి: వీఆర్‌ఏలందరూ ఐక్యమత్యంతో పేస్కేలు సాధన కొరకు అందరూ కృషి చేయాలని విఆర్‌ఎం సంఘం గౌరవ అధ్యక్షులు గుంటూరు మల్లేశ్వరి అన్నారు. ఈ మేరకు గురువారం పల్నాడు జిల్లా గ్రామ రెవెన్యూ సహా యకుల జిల్లా స్థాయి సమావేశం స్థానిక సత్తెనపల్లి కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు హారయ్యారు. సమావేశానికి జిల్లా అధ్యక్షులు షేక్‌ బందగి సాహెబ్‌ అధ్యక్షత వహించారు. మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ మాదిరి విఆర్‌ఎల ను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. గత ప్రభుత్వంలో విఆర్‌ఎలకు చాలా అన్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో అయినా విఆర్‌ఎలకు పే స్కేలు అమలు చేయాలని, అర్హత ఉన్న వారికి వీఆర్వోగా ప్రమోషన్‌ ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ విఆర్‌ఎగా నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో రైతు సంఘం నాయకులు గద్దె చలమయ్య వీఆర్‌ఏల జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందరాజు పాల్గొన్నారు.

➡️