విద్యా రంగానికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేశాం : ‘పెద్దిరెడ్డి’

ప్రజాశక్తి-రైల్వేకోడూరు రాష్ట్రంలో ఒక విద్యారంగానికే రూ.27 వేల కోట్లు నిధులు ఖర్చు చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రాజ్‌ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే కొర ముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసిపి నియోజకవర్గ నాయ కులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రతి పక్షాలు రాష్ట్రంలో అభివ ద్ధి జరగలేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలకు నాంది పలికారన్నారు. నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలను అభివద్ధి చేసి అందులో విద్యా ర్థులకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలను మంజూరు చేశారని,15,600 గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు నిర్మించామని ఇది అభివద్ధి కాదా అని ప్రశ్నిం చారు. పేదరికమే కొలబద్దగా చేసుకుని సంక్షేమ పథకాలను పార్టీలు, కులమత భేదాలకు అతీతంగా అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. షర్మిల, చంద్రబాబు స్క్రిప్టును చదువుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు అందే సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసిపి అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండూరు అజరురెడ్డి, వైసిపి రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హేమన వర్మ, సీనియర్‌ నాయకులు కొల్లం గంగిరెడ్డి, వైస్‌ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, రైతు సలహా మండలి జిల్లా చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి, జడ్‌పిటిసి రత్నమ్మ, ఉప సర్పంచ్‌ తోటశివ సాయి, సయ్యద్‌ ఆదాం, సిద్దయ్య, అంబటి మురళి, అబ్దుల్‌ సలాం,సుధాకర్‌ రాజు, రమేష్‌, అరుణ, రాజేశ్వరి, నాగమణి, శారద పాల్గొన్నారు.

➡️