ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి

May 3,2024 22:04

ప్రజాశక్తి – విజయనగరం కోట :  ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే చంద్రబాబుకు ఓటు వేయాలని విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని 9వ డివిజన్‌ కోట్లమాదప్ప వీధి, కస్పా హైస్కూల్‌ వీధి, అయ్యకోనేరు గట్టు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు గురించి వివరించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. ఈ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమికి మద్దతు తెలిపి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడును ఎమ్‌పిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మి, వరప్రసాద్‌, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, టిడిపి మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బీసీ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు, పిల్లా విజరు కుమార్‌, గాడు అప్పారావు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు. టిడిపిలోకి 440 కుటుంబాలు చేరికపట్టణంలోని 37వ డివిజన్‌ వైసిపికి చెందిన నామన శ్రీనివాసరావు, రెడ్డిపల్లి అప్పలరాజు, పల్లంశెట్టి శ్రీనివాసరావుతో పాటు 40 కుటుంబాలు, 48వ డివిజన్‌కు చెందిన వైసిపి నాయకులు రాంబర్కి బుజ్జి, రాంబర్కి కృష్ణకు మారి, కోట్ల తాతారావు, నడిపల్లి సూరిబాబుతో పాటు 400 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వారందరికీ అదితిగజపతి రాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️