అందరి సహకారంతోనే విధుల నిర్వహణ

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు, వైద్య సిబ్బంది అందరి సహకారంతోనే రెండేళ్లపాటు సంతృప్తిగా విధులు నిర్వహించినట్లు జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం భగవాన్‌ నాయక్‌ అన్నారు. ఒంగోలు జిజిహెచ్‌ ఆడిటోరియంలో జిజిహెచ్‌, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, నర్సింగ్‌ కాలేజ్‌ స్టాఫ్‌ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం భగవాన్‌ నాయక్‌ ఉద్యోగ విరమణ సభ మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఏ ఏడుకొండలరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ భగవాన్‌నాయక్‌ మాట్లాడుతూ తన వైద్య వృత్తిలో సర్జన్‌గా ఎంత తృప్తి ఇచ్చిందో జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌గా రెండేళ్లు అదే సంతృప్తిని పొందానని తెలిపారు. రెండేళ్ల కాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది సహకారంతో విధులు నిర్వహించానన్నారు. ఇదే సహకారాన్ని వచ్చే జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం జిజిహెచ్‌లోని వివిధ విభాగాల సిబ్బంది డాక్టర్‌ ఎం భగవాన్‌ నాయక్‌, సతీమణి పద్మాబాయిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి దుర్గాదేవి, డాక్టర్‌ సుధాకరరావు, డాక్టర్‌ హనుమంతరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బాలాజీ నాయక్‌, డాక్టర్‌ ప్రభాకరరావు, ఏఆర్‌ఎంఒలు డాక్టర్‌ అనిల్‌, డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ విజయశ్రీ, డాక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ బి తిరుమలరావు, డాక్టర్‌ సుధాకర్‌బాబు, డాక్టర్‌ భగవాన్‌ నాయక్‌ కుమారుడు నాగ అశుతోష్‌, కుమార్తె జాగృతి, బంధువులు, జిజిహెచ్‌ వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️