గుడిమెట్టలో పోలీస్‌ కార్డెన్‌ సెర్చ్‌

ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామంలో బుధవారం గిద్దలూరు రూరల్‌ సీఐ దాసరి ప్రసాద్‌, రాచర్ల ఎస్‌ఐ హరిబాబు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు సందర్భంగా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని సీఐ దాసరి ప్రసాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అల్లర్లు చేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు ముందస్తుగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు సిఐ దాసరి ప్రసాద్‌ వెల్లడించారు. ఈ కార్డన్‌ సెర్చ్‌లో కొమరోలు ఎస్‌ఐ మధుసూదన్‌ రావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️