ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవు : కలెక్టర్

Mar 19,2024 14:50 ##నెల్లూరు

ప్రజాశక్తి  – నెల్లూరు : రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారం లో పాల్గొనే వాలంటీర్లు, ప్రభుత్వం లో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసు కోవడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ హెచ్చరించారు. మంగళవారం కొన్ని పత్రికల్లో ప్రభుత్వం లో పనిచేసేవారు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొంటున్నారని ప్రచురితమైన వార్తలపై కలెక్టర్ స్పందించారు . వాలంటీర్లు, ఇతర ప్రభుత్వ శాఖలలో పని చేస్తూ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న వారిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

➡️