ఎక్కడ వేసిన గొంగళి అక్కడే : చెంచలబాబు

Mar 29,2024 16:45 #Nellore District

ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నారా చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి చెంచలబాబు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని మన రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను ప్రక్క రాష్ట్రానికి పంపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందని ఈ రాష్ట్రం లో ఉన్న నిరుజ్యోగ యువత కర్ణాటక, తమిళనాడుకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బిజెపి, జనసేన, తెలుగుదేశం కూటమి విజయాన్ని ఏ పార్టీ ఆపలేదని నెల్లూరు ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎం ఎల్ ఏ అభ్యర్థి కాకర్ల సురేష్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. వారిని అఖండ మెజారిటీతో గెలించుకొనే బాధ్యత ప్రతి నాయకులు కార్యకర్తల అందరిపై ఉందని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ బయన్న, ఎల్ సి రమణారెడ్డి, ఘన మేస్త్రి రాజు, హరీష్, యాదవ్ జల్సా, యాదవ్ శివ, రామోహన్, తదితరులు పాల్గొన్నారు.

➡️