ప్రతి ఇంటికీ బాబు ష్యూరిటీ

Jan 13,2024 00:34

ప్రజాశక్తి- రాచర్ల
వైసీపీ పాలనలో వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ దోహదం చేస్తుందని టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి టీడీపీ శ్రేణులకు వివరించారు. టిడిపి మండల అధ్యక్షులు కటికే యోగానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, జనసేనల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అన్ని వర్గాల ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలతో భరోసా కల్పిస్తామని అన్నారు. టీడీపీ, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను, బాబు ష్యూరిటీ బాండ్లను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని అన్నారు.

➡️