అన్నా సమక్షంలో వైసిపిలో చేరిక

Apr 11,2024 01:07 ##YSRCP #Ve

ప్రజాశక్తి – మార్కాపురం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎంఎల్‌ఎ అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుపుకు తామంతా కృషిచేస్తామని పలువురు పేర్కొన్నారు. పొదిలి పట్టణం విశ్వనాధపురం 10వ వార్డు బీసీ కాలనీకి చెందిన 30టిడిపి కుటుంబాలు శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి వచ్చి ఎంఎల్‌ఎ అన్నా రాంబాబు సమక్షంలో వైసిపిలో చేరారు. వారికి వైసిపి కండువా కప్పి రాంబాబు సాదరంగా ఆహ్వానించారు. పొదిలి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. ఎపిఐఐసి ఛైర్మన్, వైసిపి జిల్లా అద్యక్షులు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ వైకసిపి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. శ్రావణి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆశయాలు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి టీడిపి నుంచి వైసిపిలో చేరినట్లు తెలిపారు. వైసిపిలో చేరిన వారిలో పాశం కొండయ్య, జి రామారావు, మధు, జింధాల్ వలి, మల్లి, నరేంద్ర, ఆది, మారాసి వెంకటేశ్వర్లు, రమణయ్య, శ్రీను, చిన్నా, జి నాగరాజు, సుబ్బారావు, చాతరాజుపల్లి శ్రీనివాసులు, షేక్ మస్తాన్పలి, కె దుర్గారావు, జి కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

➡️