బాధ్యతాయుతంగా జరుపుకోండి

Dec 30,2023 13:11 #Prakasam District
police guidelines to new year festival

ప్రజాశక్తి-మార్కాపురం : నూతన సంవత్సర వేడుకలను అప్రమత్తతో, జాగ్రత్తతో, అవగాహనతో బాధ్యతాయుతంగా జరుపుకోవాలని మార్కాపురం డిఎస్పి జి వీరరాఘవరెడ్డి సూచించారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా మధ్యరాత్రి ఒంటి గంట వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై శనివారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి జి. వీర రాఘవరెడ్డి మాట్లాడుతూ యువత హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసి అధిక శబ్దంతో తిరిగితే సదరు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి ఎంబీఏ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలు తమ తమ విద్యార్థులపై తప్పక పర్యవేక్షణ ఉండాలన్నారు. మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు ఫ్యామిలీ రెస్టారెంట్లు వారికి కేటాయించిన నిర్ణయత సమయంలోపే తెరిచి ఉంచాలని సూచించారు. అలా కాదని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నరు. నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలి డిఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో శిక్షణ డిఎస్పి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ షేక్ షాబాష్ అహ్మద్, సీఐ ఆవుల వెంకటేశ్వర్లు పాల్గొన్నా

➡️