స్పంద‌నలో స‌మ‌స్య‌లు స‌త్వ‌ర ప‌రిష్కారం

Nov 30,2023 15:50 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని : ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు స‌త్వ‌ర ప‌రిష్కారానికి ప్ర‌తి గురువారం ఆయా స‌చివాల‌యాల్లో నిర్వ‌హించే స్పంద‌నను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ర‌ఘునాథ్ రెడ్డి కోరారు. గురువారం ఆదోనిలోని 41, 42 వార్డు హ‌నుమాన్ న‌గ‌ర్‌, ష‌ర‌ఫ్ బ‌జార్‌ స‌చివాల‌యంలో స్పందన నిర్వహించి పలువురి నుండి అర్జీలు స్వీకరించారు. స్పంద‌నలో హౌస్ సైట్‌, వాట‌ర్ సప్ల‌య్‌, రోడ్ నిర్మాణం, స్ట్రీట్ లైట్‌, డ్రైనేజీ స‌మ‌స్య‌ల‌పై 10 అర్జీలు వచ్చాయని కమిషనర్ తెలిపారు. ఆదోని పట్టణంలో వార్డుల వారీగా ప్రతి గురువారం ప్ర‌జ‌ల నుంచి సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించే సకాలంలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు అసిస్టెంట్ ఇంజనీర్ కృపాకర్ వార్డ్ కౌన్సిలర్ లోకేశ్వరి ఇన్చార్జి నాగరాజు ఉన్నారు

➡️