రాజన్నదొర నోట కవితలు, పాటలు

Apr 13,2024 21:26

 ప్రజాశక్తి – సాలూరు: డిప్యూటీ సిఎం రాజన్నదొర నోటి వెంట ఇటీవల కాలంలో తరచూ పాటలు, కవితలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశాల్లో కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు సొంతంగా రాసుకున్న కవితలు చదువుతున్నారు. పొత్తులతో వస్తున్నారు మాయగాళ్లు జాగ్రత్త, హామీ లిచ్చి మోసం చేసే బాబులున్నారు జాగ్రత్త అంటూ కవిత చదువుతున్నారు. గత మోసాలు గుర్తు తెచ్చుకో, ఫ్యాన్‌ గుర్తు గుర్తుపెట్టుకో అని చెపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. తెలంగాణాకు చెందిన గద్దర్‌ పాడిన పాట కూడా తరచుగా పాడుతూ జనాలను, కార్యకర్తలను ఉర్రూతలూగిస్తున్నారు. జెండాలు జత కట్టడమే మీ అజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగను అజెండా అని నల్గొండ గద్దర్‌ పాడిన పాట సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఆ పాటను పాడుతూ కార్యకర్తలు, నాయకులను ఉత్తేజపరుస్తున్నారు.

➡️