అడుగడుగున రమణకు జానాదరణ

May 3,2024 21:27

ప్రజాశక్తి – కొమరాడ: సిపిఎం అభ్యర్థి మండంగి రమణకు గిరిజనుల నుంచి విశేష ఆదరణ లభించింది. మండలంలోని నాగావళి ఆవల గల 9 పంచాయతీలకు సంబంధించిన గ్రామాల్లో సిపిఎం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మండంగి రమణకు, అరుకు పార్లమెంటు ఎంపీగా పోటీ చేస్తున్న పి.అప్పలనర్సకు సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని మండలంలోని తోడుము, మత్తూరు, కొట్టు, మాదలంగి, పూజారి గూడ, కెమిశీల, బంధవలస, పొడుగువలస, తులసివలస, చెక్కవలస, లాబేసు, కొరిసెల గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మండంగి రమణ, సిపిఎం నాయకులు జగన్మోహన్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.సాలూరు: దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే ఇండియా వేదిక సిపిఎం ఎంపీ అభ్యర్ధి పాచిపెంట అప్పలనర్సకు ఓటు వేయాలని కాంగ్రెస్‌, సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం పూట వాకింగ్‌ చేసే వారిని కలిసి కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు సిగడాపు బంగారయ్య, సీనియర్‌ నాయకులు ద్వారపు రెడ్డి పుండరీకాక్ష నాయుడు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్వైనాయుడు ఎంపీ అభ్యర్థి అప్పలనర్స ని గెలిపించాలని కోరారు. మతోన్మాదంతో దేశంలో వున్న హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న బిజెపి, దాని మిత్ర పక్షాలను ఓడించాలని కోరారు.పాచిపెంట : ఇండియా వేదిక బలపరిచిన అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనరసను గెలిపించాలని కోరుతూ సిపిఎం నాయకులు మంచాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని ఈత మానువలస, పద్మాపురం, కోడికాళ్లవలస, కోటికిపెంట, కేసలి, మడవలస, కొత్తవలస, మిర్తివలస, తోటవలస, గడివలస, విశ్వనాధపురం, మంచాడ వలస, పనుకువలస గ్రామాల్లో ప్రచారం చేశారు. నిరంతరం పేదలు, గిరిజనులు, దళితుల కోసం పనిచేసిన సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి గెలిపించాలని కోరారు. మక్కువ : ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజలతో మమేకమై ఉండే సిపిఎం ఇండియా కూటమి ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనరసను గెలిపించాలని సిపిఎం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు వి.ఇందిర, ఎన్‌వై నాయుడు ప్రజలను అభ్యర్థించారు. మండలంలోని శంబరలో కీర్తిశేషులు రెడ్డి శ్రీరామమూర్తి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళ్లు అర్పించారు. నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ అరకు పార్లమెంట్‌ అభ్యర్థి అప్పలనరసకు సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తాడంగి ప్రభాకర్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం: సిపిఎం అరకు పార్లమెంటు అభ్యర్థి పి.అప్పలనరసను గెలిపించాలంటూ మండలంలోని మూలలంక, సింధునగర్‌, గాదిలంక, చినగోర, నడుకూరు, విక్రాంపురం, కాగితాడ, కంబర, కంబరవలస తదితర గ్రామాల్లో సిపిఎం నాయకులు కె.మోహన్రావు, సిహెచ్‌ అమ్మనాయుడు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్లో ప్రజా సమస్యల కోసం ప్రశ్నించే నాయకుడు అప్పలనర్సని అన్నారు. సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటేసి అప్పలనరసను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు ఎన్‌ సింహాచలం, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️