ఘనంగా రంజాన్‌ వేడుకలు

ప్రజాశక్తి కడప అర్బన్‌ దైవభక్తి, శాంతి సమైక్యతకు, సోదర స్నేహ భావాలు, దానధర్మాలు వంటి దివ్య సుగుణాల పరిమళభరిత సారమే ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ (రంజాన్‌ పర్వదినం) వేడుక ప్రత్యేకతని ఉపముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా సందేశమిచ్చారు. నగరంలోని బిల్టప్‌ సర్కిల్‌ లోని అమీనియా ఈద్గాలో పెద్దదర్గా పీఠాధిపతులు హజరత్‌ సయ్యద్‌ షా అరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ ఆధ్వర్యంలో రంజాన్‌ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్‌ ఉపవాసాలు, ఇఫ్తార్ల ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్ర మం లో మత గురువులు (మౌల్వి) ముష్టి న్యామతుల్లా సాహెబ్‌, సీనియర్‌ నాయకులు అఫ్జల్‌ ఖాన్‌, నాయకులు అర్షద్‌ బాషా, ఆసిఫ్‌ బాష, అల్లాబకాష్‌, గులాం తారిఖ, మైనారిటీ నాయకులు సుభాన్‌ బాషా, షేక్‌. జమీల్‌, వేర్హౌస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, కరిముల్లా, మాస్టర్‌ అహ్మద్‌, కలాం, స్థానిక కార్పొరేటర్లు మహమ్మద్‌ షఫీ, మహమ్మద్‌ రఫీ, చాక్లెట్‌ గౌస్‌, అలీ అక్బర్‌, షంషీర్‌, కమల్‌ బాష, మైనారిటీ, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. చెన్నూరు : మండల కేంద్రమైన చెన్నూరులో గురువారం ముస్లిం సోదరులు సంప్రదాయ పద్ధతిలో రంజాన్‌ పండుగను వైభ వంగా జరుపుకున్నారు. ఉదయం ఏడు గంటలకే చెన్నూరు మెయిన్‌ రోడ్‌ లో ఉన్న కిల్లా మసీదు వద్దకు ముస్లిం సోదరులు పిల్లలు, పెద్దలు నూతన వస్త్రాలు ధరించి ప్రార్థన కోసం మసీదు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సల్వా పందిర్లు కింద ప్రార్థనలు చేశారు. మత గురువులు ముస్లిం సోదరులకు చక్కటి సందేశాన్ని పంపుతూ వారి చేత ప్రార్థన చేయించారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. పలువురు హిందూ సోదరులు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. కలకడ : మండలంలోని కలకడ, కోన, పాపిరెడ్డిగారిపల్లి, ఎర్రకోటపల్లి, బంగారు వాండ్లపల్లి ,నడిమిచర్ల,నడమిచర్ల కొత్తపల్లి తదితర గ్రామాలలో ముస్లిం సోదరులు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగను భక్తితో శ్రద్ధలతో నిర్వహించుకున్నట్లు తెలిపారు.ముస్లిం సోదరులు తమ ఆరాధ్య దైవమైన అల్లాను వారి పవిత్ర స్థలమైన ఈద్గాల వద్దకు వెళ్లి తమ గురువులు చెప్పే ఉపన్యాసాలు విని, భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.అనంతరం ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించుకుని, నిరుపేదలకు దానధర్మాలు చేశారు.ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎస్‌ఐ రామకష్ణారెడ్డి తమ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు.బి.కొత్తకోట: పట్టణంలోని పిటియం రోడ్డులోని ఈద్గా వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరి కొకరు ఆలింగం చేసుకుని శుభాకాం క్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్‌ ర్వదినమన్నారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకొని మతసామరస్యాన్ని చాటు కోవడం స్ఫూర్తిదాయకమన్నారు.30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. సిఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ముస్లింల మత ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బం దోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ ఫయాజ్‌, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ అయుబ్‌బాషా, డాక్టర్‌ అరిఫ్‌,అహ్మద్‌ భాష, హైదర్‌, సాదిక్‌, సద్దాం, ఖాదర్‌ బాషా, మున్షిద్‌, ముబీద్‌,మియా,జాఫర్‌ బై, స్వాతి జిరాక్స్‌ సెంటర్‌ చాంద్‌ బాషా, కో-ఆప్షన్‌ మెంబర్‌ నాసర్‌, సిపిఐ సలీం, సిపిఐ బషీర్‌, పాల్గొన్నారు.రాయచోటి : జిల్లాలో ముస్లిములు భక్తి శ్రద్ధలతో రంజాన్‌ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు.30 రోజులు పాటు ముస్లింలు పవిత్రంగా ఉపవాసం ఉండి బుదవారంతో ఉపవాసాలు ముగిశాయి. రంజాన్‌ సంధర్బంగా ముస్లిం సోదరులు చిన్న పిల్లలు నుంచి పెద్ద వారి వరకు ప్రత్యేక ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు ఈద్‌ ముబారక్‌ తెలుపుకున్నారు. పట్టణంలోని ఈద్గాలో ప్రార్థనలలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, టిడిపి అభ్యర్థి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి షేక్‌ అల్లాబకాస్‌తో పాటు పలువురు నాయకులు ప్రత్యేక ప్రార్థన చేసి,మత పెద్ద లతో ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా అన్ని రంగాల్లో అభివద్ధి చెందాలని, మత సామరస్యానికి ప్రతీకగా రాయచోటి నిలవాలని వారు ఆకాంక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నమాజ్‌ ప్రార్థనలలో వేలాది మంది పాల్గొనడం హర్షనీయమన్నారు.ఈద్గాలో ప్రార్థనల సౌక ర్యార్థం ఏర్పాట్లు చేసిన ఈద్గా కమిటీ, మున్సిపల్‌, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ప్రార్థనల్లో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహమాన్‌, సీనియర్‌ నాయకులు బషీర్‌ ఖాన్‌, జమాల్‌ఖాన్‌, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహ మ్మద్‌ ఖాన్‌,మాజీ జెడ్‌పి కో-ఆప్షన్‌ సభ్యుడు అలీ నవాజ్‌, జాకీర్‌, ఫయాజ్‌ అహమ్మద్‌, షబ్బీర్‌ పాల్గొన్నారు. నిమ్మనపల్లి : నిమ్మనపల్లిలో ముస్లిం సోదరులు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ముస్లిం పెద్దలు, హజరత్‌ మాట్లాడుతూ ముస్లీంలు పవిత్ర రంజాన్‌ నెలవంక దర్శనం తరువాత రోజు నుంచి కఠోర ఉపవాస దీక్షలను మొదలు పెట్టి, నెల రోజుల పాటు వాటిని విధిగా ఆచరిస్తూ రంజాన్‌ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారన్నారు. చేసుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈద్‌ -ఉల్‌-ఫితర్‌ ఒకటని, రంజాన్‌ పండుగ ప్రార్థనల అనంతరం వారి శక్తి కొలదీ పేదలకు నగదు, వస్త్ర దానాలు చేసుకుంటార న్నారు. ప్రార్ధనల అనంతరం ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్‌ శుభాకాంక్షలు తెలు పుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్‌ సిబ్బంది గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. రైల్వేకో డూరు: సామరస్యానికి, సుహద్భావానికి, సర్వ సమానత్వానికి ప్రతీకగా రంజాన్‌ పండుగ అని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ సోదరులతో ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు.వీరబల్లి :పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్‌ పర్వదినమన్నారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకొని మతసామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తి దాయకమన్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. పోలీసులు ముస్లింల మత ప్రార్థనలకు ఎటు వంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.స్థానిక బెంగళూరు రోడ్డు లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగను భక్తితో శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ ఎమ్యెల్యే అబ్యర్థులు కూటమి అభ్యర్థి షాజహాన్‌బాషా, వైసిపి అభ్యర్థి నిస్సార్‌ అహ్మ ద్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశారు తిప్పారెడ్డిలు పొల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పీలేరు: పీలేరులో ముస్లింలు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని అన్ని మసీదుల నుంచి ముస్లిం సోదరులు స్థానిక జెండామాను దగ్గరకు చేరుకుని, అక్కడి నుంచి సామూహికంగా అల్లాను స్తుతిస్తూ మదనపల్లి మార్గంలోని ఈద్గా మైదానం చేరుకుని, పండుగ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్ధనలు చేయించిన మత గురువు మాట్లాడుతూ ప్రజలను ఈతి బాధలు, వేసవి ఎండల నుంచి కాపాడాలని, ముస్లిం యువత చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యక్రమాలకు లోను కాకుండా చూడాలని, ప్రజలు, పశు, పక్షాదులు అంతు తెలియని వింత వ్యాధుల బారిని పడకుండా కాపాడాలని, జనం పరమత సహనంతో సాటి వ్యక్తుల పట్ల ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉండేలా చూడాలని ప్రార్థించి వేడుకున్నారు.కార్యక్రమంలో జిల్లా పంచాయితీ రాజ్‌ అభివద్ధి మండలి సభ్యులు డాక్టర్‌ షేక్‌ హబీబ్‌బాషా, జిల్లాపరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు ఎన్‌ఎండి షఫి, డిసిసిబి డైరెక్టర్‌ స్టాంపుల మస్తాన్‌ సాహెబ్‌ పాల్గొన్నారు. సిఐ మోహన్‌ రెడ్డి పర్యవేక్షణలో ఎన్‌ఐ నరశింహుడు, నిబ్బంది ఈద్గా, పట్టణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీ సంఘటనలకు అవకాశం లేకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. కలికిరి: పట్టణంలోని అన్ని మసీదులలో ముస్లీం సోదరులు కలికిరి క్రాస్‌ రోడ్‌ లోని ఈద్గా మసీదుకు చేరుకుని, అక్కడి నుంచి సామూహికంగా అల్లాను స్తుతిస్తూ సన్యాసివారిపల్లి మార్గంలోని ఈద్గా మైదానం చేరుకుని, పండుగ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపు కున్నారు. గాలివీడు: గత 30 రోజులుగా ఉపవాసాలతో నింపుకొని గురువారం రంజాన్‌ పర్వదిన సందర్భంగా మండలంలోని 17 గ్రామాలలో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పిల్లలు పెద్దలు అందరూ ఆలింగనం చేసుకుంటూ రంజాన్‌ శుభాకాంక్షలు తెలుప ుకున్నారు. వేంపల్లె : ప్రతి ముస్లిం సన్మార్గం వైపు నడిస్తేనే సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారని మత గురువులు పేర్కొన్నారు. రంజాన్‌ పండుగ సందర్భంగా గురువారం వేంపల్లెలోని ఉర్దూ ఘర్‌ షాదీఖానా సమీపంలో ఉన్న ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ముస్లింలంతా కలిసి (ఈదుల్‌ ఫితర్‌) సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా స్థానిక వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న మార్కస్‌ మసీదు నుండి ర్యాలీగా ఈద్గాకు చేరుకున్నారు. మదీనాపురం, బిస్మిల్లా మసీదులో కూడా ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువులు ఖురాన్‌ సూక్తులను చదివి వినిపించారు. ముస్లింలంతా చిన్న, పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈదుల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది.పులివెందుల టౌన్‌ : పట్టణంలో ముస్లింలు ఘనంగా రంజాన్‌ వేడుకలను నిర్వహించారు. పార్నపల్లి రోడ్డు సమీపంలో ఉన్న ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ఈదుల్‌ ఫితర్‌ సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని మసీదులలో కూడా ప్రార్థనలు చేశారు. మత గురువులు ఖురాన్‌ సూక్తులను చదివి వినిపించారు. ముద్దనూరు : రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్ష విరమించి రంజాన్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని అన్ని ఈద్గాలు, తాడిపత్రి రహదారిలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత భోధకులు రంజాన్‌ ప్రాముఖ్యతను భోదించారు. అనంతరం ఒకరికొకరు ఈద్‌ ముబారక్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఖాజీపేట : ముస్లింలు రంజాన్‌ పండుగ పర్వదినాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక టీచర్స్‌ కాలనీలోని ఈద్గా, అగ్రహారంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు అల్లాV్‌ా సందేశాన్ని చదివి వినిపించారు. ప్రతి ఒక్కరూ ప్రవక్త మార్గాన్ని అనుసరించాలని వారు కోరారు. చాపాడు : మండల పరిధిలోని ముస్లింలు అన్ని గ్రామాల్లో రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మత పెద్దలు రంజాన్‌ పవిత్రత గురించి వివరించారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ అని వివరించారు. చాపాడు, అల్లాడుపల్లె, మడూరు, ఖాదర్‌పల్లి, తిమ్మాయిపల్లె, గుంతచియ్యపాడు, వెదురూరు గ్రామాల ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో భధ్రతా ఏర్పాట్లు చేపట్టారు. మైదుకూరు : రంజాన్‌ పండుగ వేడుకల సంద ర్భంగా మైదు కూరులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మైదుకూరు డిఎస్‌పి వెంకటేశులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సందేశం వినిపించారు. కార్య క్రమంలో ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌ రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : పేదలకు దానధర్మాలు చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఇస్లాం మత ముఖ్య ఉద్దేశమని జమ్మలమడుగు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్‌ షా సాదిక్‌ పాషా ఖాద్రి పేర్కొన్నారు. పట్టణంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న షాహి ఈద్గా ఆవరణలో జమ్మలమడుగు పట్టణం, మండల పరిధిలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పీఠాధిపతి కుటుంబికులు, గురువులు, ముస్లిం మైనారిటీ నాయకులు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ముల్లాజానీ, కో-ఆప్షన్‌ సభ్యులు ఫయాజ్‌బాషా పాల్గొన్నారు. నమాజు అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ ముబారక్‌ తెలుపుకున్నారు. సింహాద్రిపురం : మండలంలో ముస్లింలు రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహిం చుకున్నారు. సింహాద్రిపురం మసీదులో నిర్వహించిన ప్రార్థ నలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్ర మంలో ఇమామ్‌ ముల్లావలి, ఖాదర్‌ వలీ, బషీర్‌, జాఫర్‌ పాల్గొన్నారు. గురజాల, బిదనంచర్ల, బలపనూరు గ్రామాల్లో ముస్లింలు రంజాన్‌ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రొద్దుటూరు : పవిత్ర రంజాన్‌ పండుగను ముస్లిం సోదరులు గురువారం భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ముస్లింలు ఉదయాన్నే ఈద్గాకు వెళ్లారు. కొర్రపాడు రోడ్డు, యర్రగుంట్ల బైపాస్‌, కొత్తపల్లి పంచాయతీ పరిధిలో మూడు చోట్లలో ఉన్న ఈద్గాలలో ఎవరికి అనుకూలమైన ప్రదేశాల్లో వారు నమాజ్‌ చేశారు. ఆయా ఈద్గాలలో మత పెద్దలు మాట్లాడారు. రంజాన్‌ మాసం విశిష్టతను వివరించారు. నమాజ్‌ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టీస్‌ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీరు అందించారు.

➡️