ఐహెచ్‌ఆర్‌సి సౌత్‌ ఇండియా ఇన్‌ఛార్జిగా రవివర్మ

May 21,2024 23:27 #Ravi varma IHRC
IHRC Ravivarma

 ప్రజాశక్తి-వేపగుంట : ఐహెచ్‌ఆర్‌సి సౌత్‌ ఇండియా ఇన్‌ఛార్జిగా ప్రముఖ సామాజికవేత్త రవి వర్మ నియమితులయ్యారు. నాయుడుతోటలోని ఇండో హ్యూమన్‌ రైట్స్‌ కేర్‌ ప్రధాన కార్యాలయంలో రవి వర్మకు మంగళవారం నియామక పత్రం, గుర్తింపు కార్డును నేషనల్‌ చైర్మన్‌ రాజాన ప్రసాదరావు అందించారు. ఈ సందర్భంగా రాజాన ప్రసాదరావు మాట్లాడుతూ సమాజం, దేశం పట్ల సేవా భావం కలిగి ఉండాలని, మానవ హక్కులను తెలియజేస్తూ వాటిని కాపాడాలని కోరారు. ఈ కారయ్రక్రమంలో నేషనల్‌ అడ్వైజర్‌ కమిటీ సభ్యులు మధు, జె.రాజు, ఏపీ, తెలంగాణ స్పోర్ట్స్‌ అడ్వైజర్‌ పి.మురళి, ఏపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ వై.శ్రీనివాస్‌, సెక్రటరీ ఆర్‌ వెంకట్రావు, విశాఖపట్నం జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ బి.రమేష్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

➡️