బండ్లపల్లి రోడ్డులో పోలీసుల శ్రమదానం – కంపచెట్లు తొలగింపు

May 21,2024 09:48 #police, #presence, #Removal

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామనికి వెళ్లే రోడ్డుకు ఇరువైపుల అడ్డంగా ఉన్న కంప చెట్లను మంగళవారం ఉదయం సింగనమల్ల సిఐ శ్రీధర్‌ నార్పల ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది శ్రమదానం చేసి తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన కంప చెట్లను తీసేశారు. సోమవారం మండలం పరిధిలోని ఫ్యాక్షన్‌ గ్రామమైన బండ్లపల్లి గ్రామానికి కార్డెన్‌ సెర్చ్‌ నిమిత్తం వెళ్లిన సీఐ, ఎస్‌ఐ పోలీసులు అనుమానిత ఇండ్లను గడ్డివాములను తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి గ్రామస్తులతో మాట్లాడుతూ … ఫ్రాక్షన్‌ కు దూరంగా ఉండాలని ఫ్యాక్షన్‌ వల్ల కలిగే దుష్ఫలితాలు గతంలో బండ్లపల్లి గ్రామస్తులు ప్రత్యక్షంగా చూశారని తిరిగి మీ పిల్లలకు అలాంటి పరిస్థితిని తెచ్చుకోకండి అని సూచించారు.

➡️