విద్యార్థులకు రోటరీ క్లబ్‌ స్టడీ మెటీరియల్‌ అందజేత

ప్రజాశక్తి – మామిడికుదురు (కోనసీమ) : స్టడీమెటీరియల్‌ సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాజోలు రోటరీ క్లబ్‌ అధ్యక్షులు ఏడిద కవింద్ర అన్నారు. శుక్రవారం కరవాక హై స్కూల్‌ టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులు 20 మందికి స్టడీ మెటీరియల్‌ రోటరీ సభ్యులు దార్ల పెదబాబు ద్వారా అందించారు. ఈ స్టడీ మెటీరియల్‌ ద్వారా మరికొన్ని మార్కులు అదనంగా సాధించి మండల స్థాయి ప్రధమ ద్వితీయ స్థానాల్లో నిలబడిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వదలుచుకున్నామన్నారు. రోటరీ క్లబ్‌ ద్వారా విద్యార్థులకు మరింత ఉన్నత భవిష్యత్తు కలిగే దిశగా మరింతగా సహకారం అందించేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మణరావు, మహ్మద్‌ మొహిద్దిన్‌, కసుకుర్తి రామకఅష్ణ, ప్రధానోపాధ్యాయులు సోమేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️