ఎన్నికల నియమావళిని పట్టించుకోని ఆర్టీసీ

Mar 19,2024 17:33 #Chittoor District

ప్రజాశక్తి-పీలేరు: ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల నియమావళి అమలు చేయడంలో విఫలమైంది. పీలేరు బస్టాండు పరిసరాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రచార గోడ పత్రికలు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నా అవి వారి దృష్టిన పడలేదు సరి కదా కనీసం బస్టాండ్ పరిసరాలను పరిశీలించి, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఏవైనా రాజకీయ ప్రచార సామాగ్రి ఉందా అనే అంశాన్ని పట్టించుకోలేదనే తెలుస్తోంది. పోనీ వాటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న కనీస ఆలోచన కూడా సంబంధిత అధికారులకు రాలేదనే తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 3 రోజులు దాటినా పీలేరు పట్టణంలో కొన్ని నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార సామాగ్రిని పూర్తిగా తొలగించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు. బస్టాండ్ పరిసరాల్లోని వాణిజ్య సముదాయాల ముందు, వారపు సంత ప్రహరిపై ప్రచార గోడ పత్రికలు, ఫ్లెక్సీ చూపరుల దృష్టిని తాకుతున్నాయి. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం స్థానికంగా పలు విమర్శలకు దారి తీస్తోంది. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాటి తొలగింపు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

 

➡️