ఎస్‌సి, ఎస్‌టి లైజన్‌ ఆఫీసర్‌కు సత్కారం

May 21,2024 23:16 #SC, #st association sanmanam
sc, st association sanmanam

ప్రజాశక్తి -ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌సి, ఎస్‌టి లైజన్‌ ఆఫీసర్‌గా నియమితులైన రాధికను ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బొండా తౌడన్న, బి.మల్లయ్య ఆధ్వర్యాన ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ ఇన్‌ఛార్జి భాను సత్కరించారు. అనంతరం ఎస్‌సి, ఎస్‌టి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు. యాజమాన్యంతోనూ, ఎస్‌సి, ఎస్‌టి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాధిక హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎల్‌వి.రమణ, ఎస్‌.సత్యనారాయణ, కెవి.రత్నం, మోహన్‌బాబు, వేణుగోపాల్‌, ఫణీంద్రబాబు, గణేష్‌, బిడి.నాయక్‌, సువర్ణరాజు, మహేష్‌, బాలకృష్ణ, సాయిప్రసాద్‌, చింతా మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

➡️