ఇసుక అక్రమ రవాణా

Apr 13,2024 21:13

ప్రజాశక్తి- రేగిడి :మండలంలోని కొమిరి, రేగిడి, బొడ్డవలస కేంద్రాలుగా నాగావళి నది నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది ఇసుక ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇష్టాను సారంగా నదిని తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాల పరిధిలో సచివాలయాలు ముందు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే సచివాలయ ఉద్యోగులు ఏమి పట్టనట్లు వ్యవహరించడం పట్ల ముడుపులు అందుతున్నాయన్న అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ఎత్తైతే రాజాం -పాలకొండ ప్రధాన రహదారి ఉంగరాడ మెట్ట వద్ద పోలీస్‌ స్టేషన్‌ ముందు నుంచే రోజువారి వందలాది ఇసుక ట్రాక్టర్లు ఎటువంటి రసీదులు లేకుండా అక్రమంగా వేల క్యూబిక్‌ మీటర్లు ఇసుక వాహనాల ద్వారా అక్రమంగా తరలిపోతుంటే రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ముడుపులు అందుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర ప్రాంతాలకు తరలింపుప్రభుత్వ సహజ సంపదను అక్రమంగా ఇసుకాసురులు యథేచ్చగా రాజాం, చీపురుపల్లి, విజయనగరం ఇతర ప్రాంతాలకు తరలించడంతోపాటు తోటల్లో ఇసుకను అక్రమ నిల్వలు ఉంచి రాత్రిపూట లారీలతో విశాఖ, చెన్నై ప్రాంతాలకు లారీకి రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకూ అమ్మి సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇంత జరిగినా అధికారు లకు చలనం లేకుండా పోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసిరినాయుడు కనుసన్నల్లోనే..!ఇసుక అక్రమ రవాణా అచ్చన్న వలసకు చెందిన అసిరినాయుడు కనుసన్నల్లోనే జరుగుతుందని మండలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇతని ట్రాక్టర్లతో పాటు ఆయా గ్రామాల ట్రాక్టర్‌ యజమానులతో మమేకమై సహజ సంపద ఇసుకను దోచేస్తున్నారు. అసిరి నాయుడు ట్రాక్టర్లు సీజ్‌ చేస్తే గాని ఈ ఇసుక అక్రమ రవాణా అరికట్టలేమని బహిరంగంగానే చెబుతు న్నారు. ప్రజాశక్తి ధైర్యం చేసి కొమిరి, రేగిడి, బొడ్డవలస ఇసుక అక్రమ తవ్వకాలు వద్దకు వెళ్లి పరిశీలించగా లచ్చన్న వలస అసిరినాయుడు, వారు అనుచరులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు కూలీలు తెలిపారు. స్వయంగా అసిరి నాయుడుతో ప్రజాశక్తి మాట్లాడితే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వారానికి డబ్బు కడుతున్నట్లు చెబుతూ దుర్భాషలాడి, ఏ అధికారులతో చెప్పుకుంటే ఏమీ పీకేది లేదని సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్‌ఐకు సమాచారం ఇవ్వగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అడిగే వారే లేరనీ.. అడిగే వారు లేరనే ఉద్దేశ్యంతో ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగిడి నాగావళి నది అక్రమ ఇసుక రవాణా విషయానికొస్తే స్థానిక మాజీ, తాజా నాయకుల ప్రమేయ ంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతో ందని గ్రామస్తులు తెలిపారు. బొడ్డవలస ఇసుక అక్రమ రవాణాలో కూడా స్థానిక నాయకుల హస్తం ఉందని చెబుతున్నారు. వందలాది ట్రాక్టర్లు రాజాం- పాలకొండ ప్రధాన రహదారి బొడ్డవలస నుంచి రాజాం మీదుగా అక్రమ ఇసుక రవాణా జరిగితే చెక్‌ పోస్టులు, ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేయకపోవ డంతో పాటు వాహనాలను సీజ్‌ చేయలేక పోవడం విడ్డూరంగా ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్య ంలో ఇసుక అక్రమ రవాణా కనీసం అధికా రులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్ర మంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న ట్రాక్టర్‌ యజమానులు వైసిపి నాయకులకు ఫోన్లు చేసి ఆ నాయకులు అధికారులకు ఫోన్లు చేసి, కేసులు లేకుండా పంపించే దిశగా అధికారులు పనిచేస్తు న్నారు. ఒక వేల ఎక్కడో ఒక దగ్గర ఒకటి రెండు ట్రాక్టర్లను పట్టుకున్నా వైసిపి నాయ కులు ఫోన్‌ చేసి విడిపించడంతో తమ కెందుకు అని అధికారులు కూడా వదిలేసు ్తన్నట్లు తెలిస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రేగిడి మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ప్రభుత్వ సహజ సంపదను కాపాడి ఇసుకాసురులను గుర్తించి శాఖాప రమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️