సారా తయారీ సామాగ్రి నేలమట్టం

Apr 6,2024 21:24

 ప్రజాశక్తి – రామభద్రపురం : మండల పరిధిలో చందాపురం గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రం వద్ద శనివారం ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌ సిబ్బందితో కలిసి వెళ్ళి సారా తయారీకి సిద్దంగా ఉంచిన సుమారు వెయ్యి లీటర్ల బెల్లం ఊటలు, ఇతర సామాగ్రిని నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ అక్రమ సారా వ్యాపారం చట్ట విరుద్ధమని, మద్యం గొలుసు దుకాణాల నిర్వహణ, బహిరంగ మద్యపానం వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని పట్టుబడితే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

➡️