ఉక్కు అధికారుల సేవలు భేష్‌

ఉద్యోగ విరమణ చేసిన బిటి.నాయక్‌, వి. తిరుపతిరావులకు ఆత్మీయ సత్కారం

స్టీల్‌ప్లాంట్‌ జిఎం(ఎంఎస్‌) మధుసూధనరావు

ప్రజాశక్తి- ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన జిఎం బిటి.నాయక్‌, డిజిఎం ( హెచ్‌ఆర్‌, లైజన్‌ ఆఫీసర్‌ ) వితిరుపతి రావు సేవలు ప్రశంసనీయమని స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ఎంఎస్‌) ఎం.మధుసూధనరావు ప్రశంసించారు. సోమవారం స్టీల్‌ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీ భవన్‌లో ఉక్కు అధికారులు ఉద్యోగ విరమణ చేసిన బిటి.నాయక్‌, వి. తిరుపతిరావులకు ఆత్మీయ సత్కారం జరిగింది.ఈ సందర్భంగా జిఎం మధుసూధనరావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌పాంట్‌లో వివిధ హోదాల్లో అధికారులుగా విధులు నిర్వహించిన బిటి.నాయక్‌, తిరుపతి రావులు పలువురి మన్ననలు పొందారని కొనియాడారు. ఉక్కు అధికారులు, ఉద్యోగుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు తమ వంతు సేవలను అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులను పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.సీ భవన్‌ జాయింట్‌ సెక్రటరీ ఆర్‌.నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీ ప్రధాన కార్యదర్శి కె.విడి ప్రసాద్‌, అధికారులు దుర్గాప్రసాద్‌, బిఎస్‌ఆర్‌నాయక్‌, గణేష్‌, బి.బాలాజీ, తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆనంద్‌, బంజారా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బానోతు కృష్ణ, ఎపి గిరిజనసంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు బి. కోటేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, ఎన్‌.నర్సింగరావు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన బిటి.నాయక్‌, వి. తిరుపతిరావులకు ఆత్మీయ సత్కారం

➡️